
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడిషియల్ కస్టడీని కోర్టు మళ్లీ పొడిగించింది. కస్టడీ ముగియడంతో బుధవారం ఉదయం ఆమెనుతీహార్ జైలు అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. దీంతో జడ్జి జులై 25వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్ నివాసంలో ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈడీ కేసులో కవిత కస్టడీని పలుమార్లు పొడిగించింది. మరోవైపు బెయిల్ కోసం ఆమె చేస్తున్న అభ్యర్థనలను న్యాయస్థానాలు తోసిపుచ్చుతూ వస్తున్నాయి. కవితతో పాటు ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీని సైతం అదే తేదీ దాకా పొడిగించింది.
Comments
Please login to add a commentAdd a comment