
అనుకున్న సమయాని కన్నా కాస్త లేట్‌గా థియేటర్స్‌లోకి రానున్నాడు లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 7న విడుదల చేయాలనుకున్నారు.
కానీ నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావడానికి మరికొంత టైమ్ పడుతుందని, అందుకే వాయిదా వేసి, దీపావళికి తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో అక్టోబరు 31న రిలీజ్ చేయనున్నామనీ మేకర్స్ ప్రకటించారు. ‘‘ఓ సాధారణ వ్యక్తికి చెందిన అసాధారణ ప్రయాణమే ఈ చిత్రం. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినివ్వడం కోసం డబ్బింగ్‌తో సహా అన్ని సాంకేతిక విభాగాల విషయంలో రాజీ పడకుండా పని చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment