కోపాలు చాలండి శ్రీమతి గారు.. సాంగ్‌ విన్నారా? | Srimathigaru Song Out From Lucky Bhaskar Movie | Sakshi
Sakshi News home page

లక్కీ భాస్కర్‌: కోపాలు చాలండి శ్రీమతి గారు సాంగ్‌ వచ్చేసింది..

Published Wed, Jun 19 2024 7:52 PM | Last Updated on Wed, Jun 19 2024 7:52 PM

Srimathigaru Song Out From Lucky Bhaskar Movie

"మహానటి", "సీతారామం" సినిమాలతో తెలుగులో ఘన విజయాలను సొంతం చేసుకున్న దుల్కర్‌ సల్మాన్‌ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం "లక్కీ భాస్కర్". వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ ఇటీవలే రిలీజై ఆకట్టుకుంది. బుధవారం ఈ చిత్రం నుంచి "శ్రీమతి గారు" అనే మొదటి గీతాన్ని విడుదల చేశారు.

సాంగ్‌ అదిరింది
జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మెలోడీ ఎంతో వినసొంపుగా ఉంది. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్‌లు తమ మధుర స్వరాలతో చక్కగా ఆలపించి, పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చారు. గీతరచయిత శ్రీమణి అందించిన సాహిత్యం ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు" అంటూ అందరూ పాడుకునేలా, తేలికైన పదాలతో అర్థవంతమైన సాహిత్యం అందించారు. 

పాన్‌ ఇండియా స్థాయిలో..
మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement