‘‘ఫలానా పాత్రలే చేయాలి. వయసుకు తగ్గ పాత్రలే చేయాలని నేనేం పరిమితులు పెట్టుకోలేదు. ఒకే తరహా పాత్రలు చేస్తే నటిగా నాకే కాదు... స్క్రీన్‌పై నన్ను చూసే ఆడియన్స్‌కు కూడా బోర్ కొడుతుంది. అందుకే నటిగా ఎప్పటికప్పుడు నన్ను నేను సవాల్ చేసుకుంటుంటాను. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఇష్టపడతాను.
‘లక్కీ భాస్కర్’ సినిమాలో తొలిసారిగా నేను అమ్మ పాత్ర చేశాను. ఇక ‘మట్కా, మెకానిక్ రాకీ’ చిత్రాల్లోనూ డిఫరెంట్ రోల్స్ చేశాను’’ అన్నారు హీరోయిన్ మీనాక్షీ చౌదరి. దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీనాక్షీ చౌదరి చెప్పిన విశేషాలు.
⇒ ‘లక్కీ భాస్కర్’లో మధ్యతరగతి గృహిణి సుమతి పాత్ర చేశాను. ప్రేమను పంచే కుటుంబం, జీవించడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలనుకునే స్వభావం భాస్కర్ (దుల్కర్ పాత్ర)ది. కానీ ఎక్కువ డబ్బు, దురాశల కారణంగా భాస్కర్–సుమతిల మధ్య ఏం జరిగింది? అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు మాది మధ్యతరగతి ఫ్యామిలీయే. నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉంటారో తెలుసుకుని, అందుకు తగ్గట్లుగా ఈ పాత్ర చేశాను. సుమతి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాననుకుంటున్నాను.
⇒ నేను నటించిన ‘మట్కా, మెకానిక్ రాకీ’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం వెంకటేశ్‌గారితో ఒక సినిమా చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment