RRR Movie Postponed: Netizens React with Memes and Jokes
Sakshi News home page

RRR Postponed Trolls: ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా.. ఫన్నీగా, బాధగా ట్రోలింగ్‌

Published Sat, Jan 1 2022 8:08 PM | Last Updated on Tue, Mar 15 2022 12:54 PM

Netizens Hilarious Reaction On RRR Movie Postponed - Sakshi

Netizens Hilarious Reaction On RRR Movie Postponed: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మల్టీ స్టారర్‌ చిత్రం రౌద్రం.. రణం.. రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్‌) విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి పెద్ద షాక్‌ ఇచ్చింది జక్కన్న టీం. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మోస్ట్‌ అవేటెడ్ మూవీ మరోసారి వాయిదా పడి అభిమానులు, సినీ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే రిలీజ్‌ వాయిదాకు కారణం లేకపోలేదు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం, థియేటర్‌ ఆక్యుపెన్సీలో ఆంక్షలతో సినిమా వాయిదా వేసేందుకే చిత్ర యూనిట్‌ నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోషన్లు చేసిన చిత్రయూనిట్‌ ఒమిక్రాన్‌ ఉధృతి వల్ల ఈ నెల 7న ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలను నిలిపివేయనున్నట్లు కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.
 


కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం విడుదలకు ఆరు రోజుల ముందు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించే సరికి జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో నెటిజన్లు ఆర్‌ఆర్‌ఆర్‌పై ట్రోలింగ్‌తో దండయాత్ర మొదలుపెట్టారు. సోషల్‌ మీడియాలో ఫన్నీ మీమ్స్‌తో  ఈ ట్రోలింగ్‌ను ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లను తలపిస్తున్నారు. ఎన్టీఆర్‌, రాజమౌళి  తదితర సినిమాల వీడియో క్లిప్‌లను ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వాయిదా సందర్భానికి సింక్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. 

ఫన్నీ మీమ్స్, వీడియో క్లిప్‌లతో తమ ప్రస్టేషన్‌ను చూపిస్తే మరికొందరూ బాధతో పోస్టులు పెడుతున్నారు. 'వాయిదా వేయడం పెద్ద కొత్త కాదు, అలవాటైంది. కానీ మరీ 6 రోజుల ముందు వాయిదా వేయడం హార్ట్‌ బ్రేకింగ్‌గా ఉంది.' అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement