న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం మే 26న జరగాల్సిన రాతపరీక్షను.. జూన్ 16వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది. ఈ మేరకు UPSC తన వెబ్‌సైట్‌లో ఓ ప్రకటనలో తెలిపింది.
‘త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష - 2024ను వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయించింది. మే 26న కాకుండా జూన్ 16న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్‌కు కూడా వర్తిస్తుంది’ అని పేర్కొంది.
కాగా యూపీఎస్సీ-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 14 విడుదలైంది. సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా పరిగణిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎఎస్ అయ్యేందుకు ప్రతి సంవత్సరం లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment