నెల ఆలస్యంగా కంగువ | Release of Suriya Kanguva postponed to November 14 | Sakshi
Sakshi News home page

నెల ఆలస్యంగా కంగువ

Published Fri, Sep 20 2024 4:22 AM | Last Updated on Fri, Sep 20 2024 4:22 AM

Release of Suriya Kanguva postponed to November 14

‘కంగువ’ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. సూర్య హీరోగా నటించిన ఈ భారీ పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రాన్ని నవంబరు 14న రిలీజ్‌ చేయనున్నట్లు గురువారం మేకర్స్‌ ప్రకటించారు. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్, యోగిబాబు ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ ఈ సినిమాను నిర్మించారు.

ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ రిలీజ్‌ చేయనున్నారు. ‘‘పీరియాడిక్‌ యాక్షన్‌ జానర్‌లో ఇప్పటివరకూ రాని ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ‘కంగువ’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘కంగువ’ సినిమాను తొలుత ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్‌ చేయాలనుకున్నారు. ఫైనల్‌గా ఓ నెల ఆలస్యంగా నవంబరు 14కి వాయిదా వేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement