‘కంగువ’ సినిమా దసరాకు రిలీజ్ కావడం లేదనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కంగువ’. దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి.
ఈ చిత్రాన్ని అక్టోబరు 10న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. దసరా సెలవులను టార్గెట్‌గా చేసుకుని ‘కంగువ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా అక్టోబరు 10న విడుదల కావడం లేదని, నవంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని, అది కూడా దీపావళి పండగ సమయంలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందనే టాక్ తమిళ పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment