'సలార్' రిలీజ్ వాయిదా పడిందా? నిజమేంటి? | Salaar Movie Release Date Gets Postponed? Here's The Truth - Sakshi
Sakshi News home page

Salaar Movie: 'సలార్'పై కొత్త రూమర్.. రిలీజ్ డేట్ మారిందా?

Published Fri, Sep 1 2023 3:11 PM | Last Updated on Fri, Sep 1 2023 3:25 PM

Salaar Movie Release Postponed From September 28th - Sakshi

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. 6వ తేదీన ట్రైలర్ రాబోతుందని అందరూ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎప్పుడు చూస్తామా అని తెగ ఆరాటపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో రిలీజ్ వాయిదా అనే రూమర్ బయటకొచ్చింది. ఇంతకీ ఏం జరుగుతోంది?

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు చేశాడు. కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ అతడికి తగ్గ హిట్ అనిపించుకోలేకపోయాయి. డార్లింగ్ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో వాళ్ల ఆశలన్నీ 'సలార్'పై పెట్టుకున్నారు. ఎందుకంటే కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడమే దీనికి కారణం.

(ఇదీ చదవండి: 'ఖుషి' రిజల్ట్‌పై విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్)

ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'.. మొన్న జూన్ లో వచ్చి ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. ఇది అయిన కొన్నాళ్లకు సలార్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి ఆశలు పెంచారు. ఇప్పుడు మరో 27 రోజుల్లో రిలీజ్ ఉందనగా, ట్విట్టర్‌లో వాయిదా పడనుందనే రూమర్స్ వచ్చాయి. సెప్టెంబరు నుంచి డిసెంబరుకి పోస్ట్‌పోన్ అయిందని అంటున్నారు. ప్రభాస్ మోకాలి సర్జరీ దీనికి కారణమని అంటున్నారు. మరికొందరు మాత్రం ఔట్ పుట్ విషయంలో ప్రశాంత్ నీల్ ఫెర్ఫెక్షన్ కోరుకుంటున్నాడని, అందుకే పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతుందని, దీంతో రిలీజ్ వాయిదా అంటున్నారు.

మరికొందరు మాత్రం ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ కి అంతా రెడీ అయిపోయిందని, ట్రైలర్ కూడా సెప్టెంబరు 6న రాబోతుందని అంటున్నారు. కావాలనే ఎవరో పుకారు సృష్టించారని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదని, ఫ్యాన్స్ కావాలని వాయిదా ట్రెండ్ ఏమైనా ప్లాన్ చేశారా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రశ్నలన్నింటిపై క్లారిటీ రావాలంటే నిర్మాణ సంస్థ స‍్పందిస్తే తప్ప అసలు విషయం బయటపడదు. 

(ఇదీ చదవండి: Kushi Review: ‘ఖుషి’మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement