Shahid Kapoor Jersey Postponed: Due to Clash With KGF 2 and Beast, Deets Inside - Sakshi
Sakshi News home page

Shahid Kapoor-Jersey Postponed: యశ్‌, విజయ్‌ ఎఫెక్ట్‌, వెనక్కి తగ్గిన షాహిద్‌ కపూర్‌

Published Mon, Apr 11 2022 1:25 PM | Last Updated on Mon, Apr 11 2022 1:50 PM

Shahid Kapoor Jersey Postponed Due to Clash With KGF 2 and Beast - Sakshi

Shahid Kapoor Jersey Postponed New Release Date Here: బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగు అర్జున్‌ రెడ్డి సినిమాను 'కబీర్‌ సింగ్‌'గా రీమెక్‌ చేసిన తర్వాత షాహిద్‌ చేస్తున్న మరో రీమెక్‌ చిత్రం ఇది. నెచురల్ స్టార్‌ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. అయితే విడుదలకు ఇంకా 3 రోజులు ఉందనగా మరోసారి జెర్సీని పోస్ట్‌పోన్‌ చేస్తూ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది.

చదవండి: స్టార్‌ హీరో అయ్యుండి ఇలా చేస్తారనుకోలేదు: విజయ్‌పై పూజా కామెంట్స్‌

ఇదే వారం పాన్‌ ఇండియా చిత్రాలు కేజీఎఫ్‌ 2, బీస్ట్‌లు విడుదల అవుతోన్న నేపథ్యంలో జెర్సీ టీం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జెర్సీ పోస్ట్‌పోన్‌ అయిందని, ఏప్రిల్‌ 22కు ఈ మూవీని వాయిదా వేసినట్లు తాజాగా సినీ విశ్లేషకుడు తరణ్‌ అదర్శ్‌ ట్వీట్‌ చేశాడు. ‘ఎ‍క్స్‌క్లూజివ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌.. జెర్సీ మరో వారానికి వాయిదా పడింది. నిన్న(ఆదివారం) రాత్రి మేకర్స్‌ ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 22 ఏప్రిల్‌ 22న జెర్సీ థియేటర్లోకి రానుంది’ అంటూ తరణ్‌ ఆదర్శ్‌ రాసుకొచ్చాడు.  కాగా క్రికెటర్‌గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్‌ బ్యాట్‌ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? అనే ఎమోషనల్‌ అంశాలతో తెరకెక్కించిన సినిమా జెర్సీ. 

చదవండి: RK Roja: కామెడీ షో జబర్దస్త్‌కు ఆర్కే రోజా గుడ్‌బై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement