Release Dates Of Vijay 'Beast Movie' And Yash 'KGF 2' Being Clashed - Sakshi
Sakshi News home page

'కేజీఎఫ్ 2'కి పోటీగా విజయ్ 'బీస్ట్'..!

Published Wed, Mar 23 2022 12:16 AM | Last Updated on Wed, Mar 23 2022 11:21 AM

Release Dates Of Vijay Beast And Yash KGF 2 Being Clashed - Sakshi

నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో కోలీవుడ్‌ స్టార్ దళపతి విజయ్‌ హీరోగా నటించిన చిత్రం 'బీస్ట్‌'. ఇక తాజాగా 'బీస్ట్‌' విడుదల తేది గురించి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది చిత్ర బృందం. ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రం నుంచి విడుదలైన 'అరబిక్ కుతు' లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. త్వరలోనే 200 మిలియన్ వ్యూస్ మైలురాయిని చేరనుంది. 

ఇదిలా ఉంటే ఏప్రిల్ 14న మరో పాన్ ఇండియా చిత్రం 'కేజీఎఫ్ 2' విడుదల కానుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ ఇప్పటికే సిద్ధంగా ఉంది. కాగా 'కెజియఫ్' చిత్రం పాన్‌ ఇండియా లెవల్లో పెద్ద హిట్‌ కావడంతో 'కేజీఎఫ్ 2' పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. మార్చి 27న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేయనున్నట్టు చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇటీవల ఓ ట్వీట్‌లో పేర్కొన్నాడు. అయితే ఒకేసారి ఇద్దరు పెద్ద స్టార్‌ హీరోల సినిమాలు విడుదల కావడం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement