Yash KGF 2 Vijay Beast Trade Experts About Collections: ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన భారీ బడ్జెట్, బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25న విడుదలైన ఈ మూవీ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. తాజాగా ఈ ఏప్రిల్‌లో సినిమా ఆడియెన్స్‌ను మరో రెండు భారీ సినిమాలు కనువిందు చేయనున్నాయి. ఒకటి సెన్సేషనల్ హిట్ సాధించిన 'కేజీఎఫ్' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'కేజీఎఫ్: చాప్టర్ 2'. ఇక మరొ మూవీ తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'బీస్ట్'. సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఉన్న 'కేజీఎఫ్ 2' ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించిన 'బీస్ట్' ఒకరోజు ముందుగా ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తొలుత ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావాల్సింది. కానీ విజయ్ తన 'బీస్ట్' సినిమాను ఒక రోజు ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు.
అయితే ఈ రెండు భారీ సినిమాలు ఒక రోజు తేడాతో విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఎలా ఉండనున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళనాడు థియేటర్, మల్టీఫ్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుపూర్ ఎం సుబ్రమణ్యం మాట్లాడుతూ 'ఏప్రిల్ మధ్యలో రెండు భారీ బడ్జెట్ చిత్రాల విడుదల కారణంగా థియేటర్ యజమానులు రెండు సినిమాలకు స్క్రీన్‌ల సంఖ్యను తగ్గించవలసి వస్తుంది. కనీసం ఒక వారం గ్యాప్‌తో విడుదల చేసుంటే అటు నిర్మాతలకు, ఇటు థియేటర్ యజమానులకు మరింత లాభదాయకంగా ఉండేది.' అని తెలిపారు. 'ఎప్పుడైనా సరే ఒక పెద్ద సినిమా విడుదలనే అనువైనది. అయితే వివిధ భాషల్లో రిలీజవుతున్న కేజీఎఫ్ 2 మాతృక భాష కన్నడ, బీస్ట్ మాతృక భాష తమిళం కాబట్టి పెద్ద సమస్య ఏం ఉండకపోవచ్చు.' అని ట్రేడ్ నిపుణుడు రమేష్ బాలా పేర్కొన్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ 2 పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. అయితే కేజీఎఫ్ 2, బీస్ట్ రిలీజ్ అంచనాలు పూర్తిగా భిన్నమైనవి. బీస్ట్ అనేది ప్రాథమికంగా ఒక తమిళ చిత్రం. ఇది ఇతర భాషల్లోకి డబ్ చేయబడింది. కానీ ఉత్తరాదిన విజయ్‌కు మంచి స్టార్‌డమ్ ఉంది. 'తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విజయ్‌కు ఉన్న ప్రజాదరణ కారణంగా బీస్ట్‌దే పైచేయి అవుతుందని భావిస్తున్నారు. అలాగే కన్నడ సినిమా అయినా కేజీఎఫ్ 1కు నార్త్‌తోలోనూ ఘన విజయం సాధించిన చరిత్ర ఉన్నందున కేజీఎఫ్ 2 కూడా మంచి పోటీ ఇవ్వనుందనే చెప్పవచ్చు.' అని బాలా తెలిపారు.
'గతంలో ఆర్ఆర్ఆర్ విడుదల సమయంలో తన పోటీదారులతో ఎలా పోరాడిందో పక్కనపెడితే కేజీఎఫ్ 2, బీస్ట్ ఒకేసారి విడుదల కానున్నాయి. వారాంతంలో ఈ సినిమాలకు మంచి బిజినెస్ ఉండనుంది. 2022 సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ వీకెండ్. ఎందుకంటే తమిళ నూతన సంవత్సరం, విషు పండుగతో సహా 5 రోజులు సెలవులు ఉన్నాయి. అలాగే ఇది వేసవి ప్రారంభం. మాకు తెలిసి వేసవిలో 5-10% ప్రేక్షకులు అదనంగా థియేటర్లకు వస్తారు. పండుగ రోజులు ఉండటం వల్ల రెండు చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించే అవాకశం ఉంది. ఓపెనింగ్ డే కలెక్షన్ చాలా ముఖ్యమైనదని, ఈ కరోనా పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నందున సినిమా మరింత వాయిదా వేసి ఇతర తేదిల్లో విడుదల చేయడం ఉత్తమం.' అని పరిశ్రమ, ట్రేడ్ నిపుణుడు శ్రీధర్ పిళ్లై తెలిపారు.
చదవండి: 'బీస్ట్' నుంచి మరో సాంగ్.. 'జాలీ ఓ జింఖానా' అంటూ విజయ్ సింగింగ్
Comments
Please login to add a commentAdd a comment