కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ రేపటికి వాయిదా | Kavitha Bail Petition Hearing Postponed To April 24 | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసు: కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ రేపటికి వాయిదా

Published Tue, Apr 23 2024 3:47 PM | Last Updated on Tue, Apr 23 2024 5:17 PM

Kavitha Bail Petition Hearing Postponed To April 24 - Sakshi

ఢిల్లీ: లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ రేపటికి(ఏప్రిల్‌ 24) వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గంటన్నర సేపు వాదనలు వినిపించింది.   

ఈడీ వాదనలు:

  • కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు 
  • మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు
  • అరెస్టు చేయబోమని మేము కోర్టుకు అండర్‌టేకింగ్‌ ఇవ్వలేదు
  • కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వబోమని చెప్పాం
  • ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది ,
  • అరెస్టు ప్రక్రియ అంతా చట్టబద్దంగా జరిగింది
  • సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది
  • ఈ స్కామ్‌లో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది
  • కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు
  • దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు
  • పాలసీని సౌత్‌ గ్రూప్‌నకు అనుకూలంగా మార్చారు
  • ఇండో స్పిరిట్ కంపెనీ ద్వారా లంచాల సొమ్ము కవిత తిరిగి రాబట్టుకున్నారు
  • ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది
  • ట్రాన్సిట్ రిమాండ్‌లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు
  • అరెస్టు చేసిన 24 గంటల్లో కవితను కోర్టులో హాజరుపరిచాం 
  • పీఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు
  • ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు
  • అరుణ్ పిళ్లై కవితకు బినామీ
  • ఇండో స్పిరిట్ లో 33.5 అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు
  • ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది 
  • డీల్ లో భాగంగా 100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో  అంగీకరించారు 
  • బుచ్చి బాబు వాట్సాప్ చాట్‌లో కూడా ఈ విషయం బయటపడింది
  • ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది
  • ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు
  • వివిధరకాల వ్యక్తుల స్టేట్‌మెంట్స్‌, ఇతర సాక్షాల ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు
  • గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి
  • ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది
  • కవిత ఈ కేసులో పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement