
కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ విడుదల మరోసారి వాయిదా పడింది. శుక్రవారం (సెప్టెంబర్ 6న) ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయని కారణంగా మరోసారి వాయిదా పడింది. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్‌లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది.
ఈ సినిమా పలుమార్లు విడుదల (2023 నవంబరు 24, 2024 జూన్ 14, 2024 సెప్టెంబర్ 6) వాయిదా పడింది. దీనిపై కంగనా రనౌత్ స్పందిస్తూ ‘‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి బాధగా ఉంది. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని పేర్కొన్నారు.