
‘శాకుంతలం’ సినిమా ప్రేక్షకుల ముందుకు ఆలస్యంగా రానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ లీడ్ రోల్స్‌లో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ముందు గత ఏడాది నవంబరు 4న విడుదల చేయాలనుకున్నారు.
అయితే 3డీ విజువల్ ఎక్స్‌పీరియన్స్, వీఎఫ్‌ఎక్స్ (గ్రాఫిక్స్) పనులు పూర్తి కాని కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి 17కి వాయిదా వేశారు. కానీ 17న కూడా ‘శాకుంతలం’ థియేటర్స్‌కి కావడం లేదు. విడుదల వాయిదా వేస్తున్నామని, కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment