గేమ్‌ చేంజ్‌ | Release date of Ram Charan and Kiara Advanis Game Changer postponed | Sakshi
Sakshi News home page

గేమ్‌ చేంజ్‌

Published Mon, Oct 14 2024 12:18 AM | Last Updated on Mon, Oct 14 2024 12:18 AM

Release date of Ram Charan and Kiara Advanis Game Changer postponed

గేమ్‌ డేట్‌ చేంజ్‌ అయింది. ఎందుకంటే ఆడే ఆటని అందరూ చూడాలంటే సరైన తేదీ ఉండాలి కదా. అందుకే ఆటని సంక్రాంతికి మార్చారు. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్‌ చేంజర్‌’ గురించే ఇదంతా. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌ రాజు ప్రోడక్షన్స్‌ బ్యానర్స్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఇందులో కియారా అద్వాని హీరోయిన్‌. క్రిస్మస్‌ సందర్భంగా ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయాలనుకున్నారు.

అయితే వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నప్పుడు క్రిస్మస్‌ కన్నా సంక్రాంతి అయితే బాగుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్‌సీస్‌లోని డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ భావించాం.

అయితే సంక్రాంతికి చిరంజీవిగారి ‘విశ్వంభర’ కూడా ఉంది.  ‘విశ్వంభర’ భారీ బడ్జెట్‌ చిత్రమే. అయితే ‘గేమ్‌ చేంజర్‌’ మూడేళ్లుగా నిర్మాణంలో ఉందని, సంక్రాంతి డేట్‌ కావాలని చిరంజీవిగారిని, యూవీ సంస్థని కోరడంతో ‘విశ్వంభర’ దాదాపు పూర్తి కావచ్చినప్పటికీ సానుకూలంగా స్పందించారు. మా సినిమా కోసం వాళ్ల సినిమాను వాయిదా వేసుకోవడానికి ఒప్పుకున్నందుకు చిరంజీవిగారికి, యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్, విక్కీకి ధన్యవాదాలు’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement