ఎన్నో అంచనాల నడుమ విడుదలైన పుష్ప సినిమా థియేటర్స్‌లో దుమ్మురేపుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు అన్ని భాషల్లో సూపర్‌హిట్ కావడం, బన్నీ- సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. విడుదలైన అన్ని ప్రాంతాల్లో పుష్ప పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. అయితే పుష్ప కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్న కేరళలో మాత్రం నిరాశే ఎదురైంది. బన్నీకి కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ నటించిన సినిమా కావడంతో పుష్ప రిలీజ్ కోసం కేరళ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. కానీ సాంకేతిక కారణాల వల్ల పుష్ప ఫైనల్ ప్రింట్ రావడంలో ఆలస్యమైంది. దీంతో సమస్యను పరిష్కరించి రేపు(శనివారం) పుష్ప మలయాళ వెర్షన్‌ను రిలీజ్ చేయనున్నారు. అప్పటివరకు కేరళలోని థియేటర్లలో పుష్ప తమిళ వెర్షన్‌ను ప్రదర్శించనున్నారు. మొత్తానికి ఒకరోజు లేటైనా తగ్గేదేలే అంటున్నారు బన్నీ ఫ్యాన్స్.
Comments
Please login to add a commentAdd a comment