
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఈనెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలను ఎన్నికలు వాయిదా వేయాలన్న సింగరేణి యాజమాన్యం అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. ఈమేరకు ఎన్నికలను వాయిదా వేసింది. డిసెంబరు 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. నవంబర్ 30 లోపు ఓటర్ లిస్ట్ చేయాలని పేర్కొంది.
ఈ నెల 28న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధం అవ్వగా, ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సింగరేణి యాజమాన్యం అప్పీల్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది.
గత ఏడాది నుంచి హైకోర్ట్‌లో సింగరేణి ఎన్నిక వివాదం జరుగుతోంది. ఎన్నికల నిర్వహణపై గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న హైకోర్ట్.. ఇప్పటికే 3 సార్లు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 23న సింగరేణి ఎన్నికల పై కీలక ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది. ఎన్నికల నిర్వహించాల్సిందిగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇవ్వగా, ఉత్తర్వులపై చీఫ్ కోర్టులో సింగరేణి అప్పీల్ చేసింది. ఈ రోజు సింగరేణి ఎన్నికలపై విచారణ జరిపిన హైకోర్టు.. సింగరేణి ఎన్నికలను డిసెంబరు 27కి వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది.
చదవండి: 17 రోజులు.. 41 సభలు
Comments
Please login to add a commentAdd a comment