
WI Vs IRE 2nd ODI Postponed: వెస్టిండీస్, ఐర్లాండ్ జట్ల మధ్య ఇవాళ జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఐర్లాండ్ జట్టులో తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఇరు జట్ల క్రికెట్ బోర్డులు సంయుక్త ప్రకటన చేశాయి. తాజా కేసులతో కలుపుకుని ఐర్లాండ్ జట్టులో కరోనా కేసుల సంఖ్య ఐదుకు చేరింది. మహమ్మారి బారిన పడిన ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటున్నారు.
3 వన్డేల ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఓ వన్డే మ్యాచ్(24 పరుగుల తేడాతో విండీస్ గెలుపొందింది) ముగిసింది. మరో రెండు వన్డేలతో పాటు టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తదుపరి మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, డిసెంబర్‌లో ఐర్లాండ్ జట్టు యూఎస్‌ఏలో పర్యటించింది. ఈ పర్యటనలో జట్టు సభ్యులకు వైరస్ సోకి ఉండవచ్చని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు అధికారులు అనుమానిస్తున్నారు.
చదవండి: టీమిండియాకు భారీ షాక్.. జట్టు సభ్యుడికి కరోనా
Comments
Please login to add a commentAdd a comment