
ప్రస్తుతం ‘పుట్టబొమ్మ’ పూజా హెగ్గే పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలు వరుసగా పరాజయం అయ్యాయి. అయినప్పటి పూజా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అదే జోరుతో హిందీలో రెండు, తెలుగులో పలు చిత్రాలకు సైన్ చేసింది. ప్రస్తుతం పూజా సల్మాన్ ఖాన్ ‘కభీ ఈథ్ కభీ దివాలీ’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్‌ను జరపుకుంటున్న మూవీ తాజాగా హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని పూజా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
చదవండి: అప్పుడు కాలర్ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు: ఆకాశ్ పూరీ
హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ షూటింగ్ రెండో షెడ్యూల్ జరుపుకోగా నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో పూజా ఇన్‌స్టా వేదిగా.. ‘హమ్మయ్యా.. ఈ షెడ్యూల్ ముగిసింది. ఇది ఒక రొమాంటిక్ చిత్రం. ఈ కథ నాకు బాగా నచ్చింది. స్క్రిప్ట్ వింటుంటూనే నాలో ఉత్సుకత మొదలైంది. ఇది తప్పకుండ అందరికీ మంచి వినోదం అందిస్తుంది’ అంటూ చిత్ర విశేషాలను పంచుకుంది. దీని అనంతరం పూజ జనగనమణ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఆమె చేతిలో మహేశ్-త్రివిక్రమ్ చిత్రం, సర్కస్ అనే హిందీ చిత్రాలు ఉన్నాయి.
చదవండి: నయనతార ప్రశంస అమితానందాన్ని ఇచ్చింది: కెమెరా మెన్
Comments
Please login to add a commentAdd a comment