కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహించిన యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ త్వరలో ఇంటివాడు కోబోతున్నాడు. గత కొంతకాలంగా ఐపీఎల్లో విరామం లేకుండా గడిపిన సూర్యకుమార్.. తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు. దీనికి సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే వధువుకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడికాలేదు.