KKR Batsman Nitish Rana Gets Engaged with his Girlfriend Saachi Marwah- Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలు ఎక్కనున్న మరో క్రికెటర్

Published Tue, Jun 12 2018 11:07 AM | Last Updated on Tue, Jun 12 2018 12:09 PM

KKR batsman Nitish rana gets engaged - Sakshi

నితిశ్‌ రాణా, సాచి మర్వా

సాక్షి, న్యూఢిల్లీ: క్రికెటర్లు ఒక్కొక్కరూ వివాహానికి సిద్ధమైపోతున్నారు. గత వారం ఐపీఎల్‌ 11 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున బరిలోకి దిగిన బౌలర్ సందీప్ శర్మ తన స్నేహితురాలిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. తాజాగా మరో ఆటగాడు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. ఇదే ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన నితిశ్‌ రాణా త్వరలో ఓ ఇంటి వాడుకాబోతున్నాడు.

తన చిన్ననాటి స్నేహితురాలు సాచి మర్వాతో  ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో నితిశ్ రాణాకు తన స్నేహితురాలు సాచిన మార్వాకు నిశ్చితార్థం జరిగింది. అతి తక్కువమంది సన్నిహితులు, స్నేహితుల మధ్య ఇరు కుటుంబాలకు చెందిన వారు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోల్‌కతా నైట్‌ రైటర్స్‌ తన అధికారిక ట్విటర్ ద్వారా కొత్త జంట ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement