
మార్చి 4న మనోజ్ నిశ్చితార్థం
హైదరాబాద్: కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ నిశ్చితార్థం తేదీ ఖరారైంది. తన స్నేహితురాలు ప్రణతిరెడ్డితో మనోజ్కు పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. ఈ వేడుక మార్చి 4న హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో ఉదయం 10.30 గంటలకు జరగనుంది.
మంచు కుటుంబ సభ్యులు ఇప్పటికే అందరినీ ఆహ్వానించే పనిలో ఉన్నారు. టాలీవుడ్లోని నటీనటులు, ప్రముఖ రాజకీయ నాయకులను ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.
ఈ వేడుకను తెలుగు సంప్రదాయ పద్ధతుల్లోనే చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నట్టు మంచు మనోజ్కు అత్యంత సన్నిహితుడు ఒకరు.. చెప్పారు. మొదట మనోజ్ ఇంట్లో పూజ నిర్వహిస్తారు. తరువాత హోటల్లో ఉంగరాలు మార్చుకుంటారని ఆయన తెలిపారు.
ప్రణతి రెడ్డి బిట్స్ పిలానిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అంతేకాకుండా మంచు విష్ణు భార్య విరానికాకు క్లాస్మేట్ అనే విషయం తెలిసిందే