
ప్రముఖ ఫిలిం ఫైనాన్సర్ , ఆర్ - సెక్యూర్డ్ ఫైనాన్స్ అధినేత బంగారు బాబు చిన్న కుమారుడు క్రాంతి రెడ్డి నిశ్చితార్థ మహోత్సవం ప్రముఖ పారిశ్రామికవేత్త సీతా రామిరెడ్డి - రామ సీత దంపతుల కుమార్తె శిరీష తో హోటల్ తాజ్ కృష్ణ లో ఈరోజు (డిసెంబర్ 15) ఘనంగా జరిగింది

ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ , వ్యాపార, ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులకు అభినందనలు తెలియజేశారు

ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు చక్రపాణి, వడ్డే నవీన్, కిరణ్ అబ్బవరం, నవభారత్ బాలాజీ , మాగంటి సుధాకర్‌తో పాటు ప్రముఖ నిర్మాతలు కె. ఎస్.రామారావు, సి.కళ్యాణ్, శ్యాం ప్రసాద్ రెడ్డి, పోకూరి బాబురావు, సునీల్ నారంగ్, కె.అచ్చిరెడ్డి, జెమినీ కిరణ్, సాహు గార్లపాటి, డాక్టర్ కే. వెంకటేశ్వరరావు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవి, ఎర్నేని నవీన్, డి.వి.వి. దానయ్య, బెల్లంకొండ సురేష్, కె రాధా మోహన్, సితార ఎంటర్టైన్మెంట్స్ వంశీ తదితరులు హాజరయ్యారు
















