మరో రెండు రోజుల్లో కోహ్లి నిశ్చితార్థం! | New Year celebration! Virat Kohli and Anushka Sharma to get engaged on January 1? | Sakshi
Sakshi News home page

మరో రెండు రోజుల్లో కోహ్లి నిశ్చితార్థం!

Published Thu, Dec 29 2016 4:27 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

మరో రెండు రోజుల్లో కోహ్లి నిశ్చితార్థం!

మరో రెండు రోజుల్లో కోహ్లి నిశ్చితార్థం!

ముంబై: గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో న్యూఇయర్ వేడుకల్ని సెలబ్రెట్ చేసుకోబోతున్న ఈ జంట..  జనవరి 1వ తేదీన నిశ్చితార్థం చేసుకునే యోచనలో ఉన్నారు. 2017లో జీవితంలో స్థిరపడాలని భావిస్తున్న విరాట్-అనుష్కలు.. కొత్త ఏడాది ఆరంభపు కానుకగా నిశ్చితార్థాన్ని చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

 

ఇందుకు ఉత్తరాఖండ్లోని నరేంద్ర నగర్లోని హోటల్ ఆనందాలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి అనుష్క శర్మ తరపున కొంతమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరుకాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో ఇరు కుటుంబాల పెద్దలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై విరాట్ కోహ్లి కానీ, అనుష్క శర్మ కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. నూతన సంవత్సరం సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఉత్తరాఖండ్ విహారానికి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే.  గత కొన్నేళ్లుగా  ప్రేమించుకుంటున్న ఈ జంట... శనివారం ఉత్తరాఖండ్ ఎయిర్ పోర్ట్ల దర్శనిమిచ్చింది.

 

ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ముగిసి విరాట్ కోహ్లికి కావాల్సిన విశ్రాంతి దొరకడంతో ప్రియురాలు అనుష్కతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోనున్నాడు. దీనిలో భాగంగానే ఈసారి ఆ జంట ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని న్యూఇయర్ వేడుకలకు ఎంచుకుంది. గతేడాది నూతన సంవత్సర వేడుకల్ని విరాట్-అనుష్కలు విదేశాల్లో జరుపుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement