
త్వరలో... డెరైక్టర్ వెడ్స్ డాక్టర్
క్రిష్.. తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు కావల్సిన వినోదాన్ని ఇస్తున్నారు.
రమ్య.. ఓ డాక్టర్‌గా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇద్దరి వృత్తులూ భిన్నమైనప్పటికీ చేస్తున్నది మాత్రం సేవే. ఈ ఇద్దరూ ఒకింటివాళ్లు కాబోతున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల ట్రిడెంట్ హోటల్‌లో శనివారం క్రిష్-రమ్యల నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధరతో విచ్చేసి శుభాకాంక్షలు అందజేశారు. క్రిష్ తీసిన ‘వేదం’లో నటించిన అల్లు అర్జున్ హాజరయ్యా రు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హీరో రానా తదితరులు ఈ వేడుకలో పాల్గొని, కాబోయే దంపతులకు శుభాకాంక్షలు అందజేశారు. ఆగస్ట్ 8న తెల్లవారుజాము రెండు గంటల ఇరవైఎనిమిది నిముషాలకు క్రిష్-రమ్యల వివాహ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది.