వాళ్లిద్దరూ క్లోజ్ అయినందుకు.. ఆమె ఉడికిపోతోంది? | Salman Khan alleged girlfriend insecure of Katrina Kaif? | Sakshi
Sakshi News home page

వాళ్లిద్దరూ క్లోజ్ అయినందుకు.. ఆమె ఉడికిపోతోంది?

Published Mon, May 9 2016 11:42 AM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM

వాళ్లిద్దరూ క్లోజ్ అయినందుకు.. ఆమె ఉడికిపోతోంది?

వాళ్లిద్దరూ క్లోజ్ అయినందుకు.. ఆమె ఉడికిపోతోంది?

ముంబై: బాలీవుడ్ ప్రేమపక్షులు ఎప్పుడు కలుసుంటారో, ఎప్పుడు విడిపోతారో, ఏ గూటికి చేరుతారో.. అంతా మాయ. ఈ కోవలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ చేరారు. కెరీర్ ఆరంభంలో కత్రినా.. సల్మాన్కు దగ్గరయ్యాక ఆమె దశ తిరిగింది. సల్మాన్ తన ఇతర ప్రియురాళ్ల మాదిరే కత్రినాకు సినిమా అవకాశాలు ఇప్పించాడని బాలీవుడ్ వర్గాల కథనం. కొన్నేళ్లు సవ్యంగా సాగిన వీరి బంధం తర్వాత విడిపోయింది. సల్మాన్కు దూరమయ్యాక కత్రినా మరో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్కు దగ్గరైంది. అయితే రణబీర్తో కూడా ప్రేమ ఎక్కువ రోజులు సాగలేదు. రణబీర్, కత్రినా పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చినా, ఏమైందో కానీ ఇద్దరూ ప్రేమకు కటీఫ్ చెప్పారు. కాగా కత్రినా మళ్లీ సల్మాన్తో క్లోజ్గా ఉంటున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

కొత్త విషయం ఏంటంటే కత్రినా కైఫ్ వల్ల సల్మాన్ ప్రియురాలు, రుమేనియా బ్యూటీ లులియా వంటుర్ అభద్రతాభావానికి గురవుతోందట. కత్రినాకు సల్మాన్ మళ్లీ దగ్గరకావడంతో ఆమె అసంతృప్తిగా ఉందని బాలీవుడ్ వర్గాలు చెప్పాయి. లులియా ఈ విషయంపై సల్మాన్ను నిలదీసిందని, ఇద్దరి మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగినట్టు సమాచారం. కత్రినాకు సాయం చేయడం తనకు ఇష్టం లేదని, ఇది తనకు ఆందోళన కలిగిస్తోందని సల్మాన్కు లులియా తెగేసి చెప్పిందట. అయితే కత్రినా విషయంలో ఆందోళన వద్దని, మన రిలేషన్ కొనసాగుతుందని లులియాకు సల్మాన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. సల్మాన్, లులియాను పెళ్లి చేసుకోబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మారిన రిలేషన్స్ వల్ల ఏం జరుగుతుందే కాలమే చెబుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement