సల్మాన్ ఖాన్ కు అల్లుడు
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇంట్లో మరోసారి పండుగ వాతావరణం కనిపించనుంది. సల్మాన్ ముద్దుల చెల్లెలు అర్పితాఖాన్ బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించిన అర్పిత భర్త అయుష్, 'మా రాకుమారుడు వచ్చేశాడు. మా నిరీక్షణ ముగిసింది. మా చిన్నారి రాకుమారుడు అహిల్ వచ్చేశాడు' అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా అర్పితా, ఆయుష్ లతో పాటు సల్మాన్ కుటుంబ సభ్యులకు కూడా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Our Prince has arrived https://t.co/iz1BcVLjem
— Aayush Sharma (@aaysharma) 30 March 2016