బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెలు అర్పితా-అయుష్ దంపతులు డిసెంబర్ 27న రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే భాయిజాన్ పుట్టిన రోజునే ఈ దంపతులకు కూతురు జన్మించడం విశేషం. దీంతో కుటుంబ సభ్యులంతా సంతోషంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు. ఈ విషయం గురించి సల్మాన్ బావ(అర్పిత భర్త) అయుష్ శర్మ చెబుతూ.. ‘సల్మాన్ బర్త్ డే రోజే నా కూతురు అయాత్‌ను భూమి మీదకు తీసుకురావాలనుకున్నాను. ఇది పూర్తిగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఆయన పుట్టిన రోజు కానుకగా నా కూతురు అయాత్‌ను బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని చెప్పాడు. ‘అర్పిత డిసెంబర్ చివరి వారంలో కానీ జనవరి మొదటి వారంలో కానీ డెలివరి కానున్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈ విషయం చెప్పగానే సల్మాన్ భాయ్ ఎంతో సంబరపడి తనకు ఆ బిడ్డను బహుమతిగా ఇవ్వమని కోరాడు. ఇక అప్పుడే మేము గట్టిగా నిర్ణయించుకున్నాం. సల్మాన్ బర్త్ డే నాడే అర్పితకు డెలివరి చేయాలని డాక్టర్లను కోరాను’ అని తెలిపాడు.
ఇక తన బర్త్‌డే రోజునే మేనకోడలు కూడా పుట్టిన సందర్భంగా సల్మాన్ ఖాన్.. ‘ఈ అందమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్న నా మేనకోడలు అయాత్‌కు స్వాగతం. నా పుట్టిన రోజు కానుకగా కుటుంబమంతటికీ అందమైన బహుమతిని ఇస్తున్న అర్పిత, అయుష్‌లకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా అర్పితా ఖాన్ వివాహం 2014లో ఆయుష్ శర్మతో హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి సందర్భంగా దాదాపు రూ.16 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను సల్మాన్ చెల్లెలికి బహుమతిగా ఇచ్చాడు. ఇక అర్పిత సల్మాన్ సొంత చెల్లెలు కాదన్న సంగతి తెలిసిందే. సల్మాన్ తల్లిదండ్రులు ఆమెను దత్తత తీసుకున్నారు.
అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం: ఆయుష్ శర్మ
Published Thu, Jan 2 2020 4:02 PM | Last Updated on Thu, Jan 2 2020 7:23 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment