న్యూఢిల్లీ : సల్మాన్ ఖాన్ సొంత నిర్మాణ సంస్ధ తెరకెక్కిస్తున్న లవ్‌రాత్రి మూవీ టైటిల్ మారింది. ఈ టైటిల్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే ఆందోళనల నేపథ్యంలో మూవీ పేరును లవ్‌యాత్రిగా మార్చారు. సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మను హీరోగా లాంఛ్ చేస్తూ ఈ సినిమా రూపొందుతోంది. ఆయుష్‌తో పాటు వరీనా హుస్సేన్ బాలీవుడ్‌కు లవ్‌యాత్రితో పరిచయమవుతున్నారు.
నూతన టైటిల్‌తో పాటు మూవీ కొత్త పోస్టర్‌ను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మారిన టైటిల్‌ను ఉద్దేశిస్తూ ఇది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు అని కూడా సల్మాన్ క్యాప్షన్ ఇచ్చారు.కాగా లవ్‌రాత్రి టైటిట్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఓ అడ్వకేట్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈనెల 12న బిహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ సహా ఏడుగురు ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో టైటిల్ వివాదానికి తెరదించాలని సల్మాన్‌ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా గతంలో దీపికా పడుకోన్, రణ్‌వీర్‌సింగ్‌ల పద్మావతి టైటిల్‌పైనా రచ్చ జరగడంతో పద్మావత్‌గా సినిమా టైటిల్‌ను మార్చడంతో వివాదం సమసిపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment