Loveratri
-
నిరసన సెగ : లవ్‌యాత్రిగా మారిన సల్మాన్ టైటిల్
న్యూఢిల్లీ : సల్మాన్ ఖాన్ సొంత నిర్మాణ సంస్ధ తెరకెక్కిస్తున్న లవ్‌రాత్రి మూవీ టైటిల్ మారింది. ఈ టైటిల్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే ఆందోళనల నేపథ్యంలో మూవీ పేరును లవ్‌యాత్రిగా మార్చారు. సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మను హీరోగా లాంఛ్ చేస్తూ ఈ సినిమా రూపొందుతోంది. ఆయుష్‌తో పాటు వరీనా హుస్సేన్ బాలీవుడ్‌కు లవ్యాత్రితో పరిచయమవుతున్నారు. నూతన టైటిల్‌తో పాటు మూవీ కొత్త పోస్టర్‌ను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. మారిన టైటిల్‌ను ఉద్దేశిస్తూ ఇది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు అని కూడా సల్మాన్ క్యాప్షన్ ఇచ్చారు.కాగా లవ్‌రాత్రి టైటిట్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఓ అడ్వకేట్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈనెల 12న బిహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ సహా ఏడుగురు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో టైటిల్ వివాదానికి తెరదించాలని సల్మాన్‌ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గతంలో దీపికా పడుకోన్, రణ్‌వీర్‌సింగ్‌ల పద్మావతి టైటిల్‌పైనా రచ్చ జరగడంతో పద్మావత్‌గా సినిమా టైటిల్‌ను మార్చడంతో వివాదం సమసిపోయిన సంగతి తెలిసిందే. -
‘కత్రినాతో కలిసి నటించను’
సాక్షి, ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌తో కలిసి నటించేందుకు సల్మాన్ ఖాన్ బావ, లవ్‌రాత్రి మూవీ హీరో ఆయుష్ శర్మ విముఖత వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయుష్ శర్మ సరసన నటించేందుకు కత్రినా కైఫ్ నిరాకరించిందని గతంలో వార్తలు రాగా తాజాగా ఈ భామతో నటించేందుకు హీరో ఆయుష్ కూడా ఆసక్తి చూపలేదు. కొన్ని ప్రత్యేక కారణాలతో కత్రినాతో తాను పనిచేయలేనని ఓ ఎంటర్టైన్మెంట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ బావ ఆయుష్ శర్మ స్పష్టం చేశారు. కాగా సల్మాన్, కత్రినా కైఫ్‌ల మధ్య సన్నిహిత బంధం ఉందని బాలీవుడ్లో ప్రచారం సాగడంతో పాటు వారి ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌తో పాటు ఆఫ్‌స్ర్కీన్‌లో వారిద్దరి మధ్య సాన్నిహిత్యంపై గుసగుసలు వినిపించాయి. అయితే కత్రినా రణ్‌బీర్ కపూర్‌తో డేటింగ్లో ఉండటంతో 2008 నుంచి వీరి బంధానికి తెరపడిందని చెబుతారు. రణ్‌బీర్‌తో డేటింగ్‌కు కత్రినా కైఫ్ దూరం కావడంతో తిరిగి బాలీవుడ్ కండలవీరుడికి ఈ భామ చేరువైందనే ప్రచారం సాగుతోంది. టైగర్ జిందా హైతో గత ఏడాది నుంచి ఆన్‌స్ర్కీన్ బంధంతో వీరిద్దరూ సన్నిహితులు కాగా వచ్చే ఏడాది భారత్ మూవీలోనూ సల్మాన్, కత్రినా అభిమానులకు కనువిందు చేయనున్నారు. -
సల్మాన్‌పై ఎఫ్ఐఆర్కు కోర్టు ఆదేశం
ముజఫర్‌పూర్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్న ‘లవ్‌రాత్రి’ అనే సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్న ఫిర్యాదు రావడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా బిహార్‌లోని ఓ స్థానిక కోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. లవ్‌రాత్రి పేరు హిందూ పవిత్ర పండుగ నవరాత్రులను పోలి ఉందనీ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకే ఈ సినిమాను అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారన్న న్యాయవాది సుధీర్ కుమార్ ఫిర్యాదుపై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. -
‘లవ్‌రాత్రి’ జోడికి ఎంఎస్ ధోని విందు
రాంచీ: క్రికెట్ నుంచి కాస్త విరామం దొరకడంతో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే కూతురు జీవాతో కలిసి ఆడుకుంటున్న వీడియోలను ధోని సామాజిక మాధ్యమాల ద్వారా తరచు పంచుకుంటూనే ఉన్నాడు. తాజాగా తన నివాసంలో ‘లవ్‌రాత్రి’ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ఆయుష్ శర్మ, వరీన హుస్సేన్‌కు విందు కార్యక్రమం ఏర్పాటు చేశాడు ధోని. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వీరు రాంచీలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొననున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితాఖాన్ భర్త ఆయుశ్ శర్మ ‘లవ్‌రాత్రి’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఎంఎస్ ధోని - సల్మాన్‌ఖాన్ చాలా మంచి స్నేహితులు. ఆయుశ్ శర్మ రాంచీ వస్తున్నాడని తెలుసుకున్న ధోని తన నివాసంలో ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయనతో పాటు వరీన హుస్సేన్‌ను ఆహ్వానించాడట. లవ్‌రాత్రి చిత్రానికి సల్మాన్‌ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.