‘కత్రినాతో కలిసి నటించను’ | Aayush Sharma Clarifies Cant Work With Katrina For Obvious Reasons | Sakshi
Sakshi News home page

‘కత్రినాతో కలిసి నటించను’

Published Fri, Sep 14 2018 10:03 AM | Last Updated on Fri, Sep 14 2018 10:30 AM

Aayush Sharma Clarifies Cant Work With Katrina For Obvious Reasons - Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌తో కలిసి నటించేందుకు సల్మాన్‌ ఖాన్‌ బావ, లవ్‌రాత్రి మూవీ హీరో ఆయుష్‌ శర్మ విముఖత వ్యక్తం చేశారు. సల్మాన్‌ ఖాన్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయుష్‌ శర్మ సరసన నటించేందుకు కత్రినా కైఫ్‌ నిరాకరించిందని గతంలో వార్తలు రాగా తాజాగా ఈ భామతో నటించేందుకు హీరో ఆయుష్‌ కూడా ఆసక్తి చూపలేదు. కొన్ని ప్రత్యేక కారణాలతో కత్రినాతో తాను పనిచేయలేనని ఓ ఎంటర్‌టైన్‌మెం‍ట్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్‌ బావ ఆయుష్‌ శర్మ స్పష్టం చేశారు.

కాగా సల్మాన్‌, కత్రినా కైఫ్‌ల మధ్య సన్నిహిత బంధం ఉందని బాలీవుడ్‌లో ప్రచారం సాగడంతో పాటు వారి ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌తో పాటు ఆఫ్‌స్ర్కీన్‌లో వారిద్దరి మధ్య సాన్నిహిత్యంపై గుసగుసలు వినిపించాయి. అయితే కత్రినా రణ్‌బీర్‌ కపూర్‌తో డేటింగ్‌లో ఉండటంతో 2008 నుంచి వీరి బంధానికి తెరపడిందని చెబుతారు.

రణ్‌బీర్‌తో​ డేటింగ్‌కు కత్రినా కైఫ్‌ దూరం కావడంతో తిరిగి బాలీవుడ్‌ కండలవీరుడికి ఈ భామ చేరువైందనే ప్రచారం సాగుతోంది. టైగర్‌ జిందా హైతో గత ఏడాది నుంచి ఆన్‌స్ర్కీన్‌ బంధంతో వీరిద్దరూ సన్నిహితులు కాగా వచ్చే ఏడాది భారత్‌ మూవీలోనూ సల్మాన్‌, కత్రినా అభిమానులకు కనువిందు చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement