
సాక్షి, న్యూఢిల్లీ: సల్మాన్ ఖాన్ బావ ఆయూష్ శర్మ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ మీద పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. సల్మాన్ సోదరి అర్పిత భార్త అయిన ఆయూష్ శర్మ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశముందని కథనాలు వస్తున్నాయి.
ఆయూష్ శర్మ తండ్రి అనిల్ శర్మ తాజాగా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని వీరభద్రసింగ్ ప్రభుత్వంలో కీలక కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్న అనిల్ శర్మ కాంగ్రెస్‌కు ఝల్‌క్ ఇచ్చి తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మాజీ సమాచార శాఖ మంత్రి సుఖ్రామ్ కుమారుడైన అనిల్ శర్మ వీరభద్రసింగ్‌కు నమ్మకమైన కుడిభుజం. ఆయనే కమలం గూటికి చేరడం కాంగ్రెస్ పార్టీని షాక్ గురిచేసింది.
బీజేపీలో చేరిన తనకు మాండీ టికెట్‌ను పార్టీ అధినాయకత్వం ఖాయం చేసిందని అనిల్ శర్మ స్పష్టం చేశారు. అదే సమయంలో మీ కుమారుడు ఆయూష్‌కు కూడా టికెట్ లభించే అవకాశముందా? అని మీడియా ప్రశ్నించగా.. అది బీజేపీ నాయకత్వం నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. తనకు, తన కొడుకు ఆయూష్‌కు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాకే.. ఆయన బీజేపీ గూటికి చేరినట్టు కథనాలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment