ఏకిపారేసిన హీరో చెల్లెలు | Arpita Khan Posts Strongly-Worded Message For the 'Jobless and Bored' | Sakshi
Sakshi News home page

ఏకిపారేసిన హీరో చెల్లెలు

Published Thu, May 26 2016 2:15 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

ఇన్స్టాగ్రామ్ పేజీలో అర్పిత పోస్ట్ చేసిన ఫొటో

ఇన్స్టాగ్రామ్ పేజీలో అర్పిత పోస్ట్ చేసిన ఫొటో

తమ కుటుంబంపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ పై స్పందిచవద్దని సన్నిహితులు, శ్రేయోభిలాషులను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ కోరింది. పనిపాట లేనివాళ్లు చేసే వ్యాఖ్యల గురించి పట్టించుకోవద్దని సలహాయిచ్చింది. ఈ మేరకు మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో స్ట్రాంగ్ మెసేజ్ పోస్ట్ చేసింది.

'ఏ పని లేనివాళ్లు, అసూయపరులు, అభ్రతపరులు చేసే వ్యాఖ్యలు పట్టించుకోకండి. వీరు కామెంట్స్ కు ప్రాధాన్యత ఇవ్వొద్దు. ఇలాంటి వారు చేసే వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇస్తే తర్వాత దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. నా ఫొటోలు, కుటుంబం, భర్త, బరువు, ముఖం, రంగు, లైఫ్ స్టయిల్ గురించి వ్యాఖ్యలు చేసినా రెస్పాండ్ కావద్దు. నా పిల్లాడితో నేను ఏం చేస్తున్నాను, వాడి గురించి ఎటువంటి కేర్ తీసుకుంటున్నాను అనే విషయాల గురించి వాళ్లకు ఎందుకు? పనిపాటా లేకుండా ఎదుటి వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి కామెంట్ చేసేవాళ్లను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునే బదులు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చుకదా? కుక్కల్లా మొరగడం మానేసి మంచి పనులు చేయాల'ని అర్పిత హితబోధ చేసింది.

తన సంసారం జీవితం, సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి మీడియాలో పుంఖాను పుంఖాలు కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement