Salman Khans sister
-
ఏకిపారేసిన హీరో చెల్లెలు
తమ కుటుంబంపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ పై స్పందిచవద్దని సన్నిహితులు, శ్రేయోభిలాషులను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ కోరింది. పనిపాట లేనివాళ్లు చేసే వ్యాఖ్యల గురించి పట్టించుకోవద్దని సలహాయిచ్చింది. ఈ మేరకు మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో స్ట్రాంగ్ మెసేజ్ పోస్ట్ చేసింది. 'ఏ పని లేనివాళ్లు, అసూయపరులు, అభ్రతపరులు చేసే వ్యాఖ్యలు పట్టించుకోకండి. వీరు కామెంట్స్ కు ప్రాధాన్యత ఇవ్వొద్దు. ఇలాంటి వారు చేసే వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇస్తే తర్వాత దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. నా ఫొటోలు, కుటుంబం, భర్త, బరువు, ముఖం, రంగు, లైఫ్ స్టయిల్ గురించి వ్యాఖ్యలు చేసినా రెస్పాండ్ కావద్దు. నా పిల్లాడితో నేను ఏం చేస్తున్నాను, వాడి గురించి ఎటువంటి కేర్ తీసుకుంటున్నాను అనే విషయాల గురించి వాళ్లకు ఎందుకు? పనిపాటా లేకుండా ఎదుటి వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి కామెంట్ చేసేవాళ్లను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునే బదులు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చుకదా? కుక్కల్లా మొరగడం మానేసి మంచి పనులు చేయాల'ని అర్పిత హితబోధ చేసింది. తన సంసారం జీవితం, సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి మీడియాలో పుంఖాను పుంఖాలు కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించింది. -
సల్మాన్ సోదరి పెళ్లికి ‘ఫలక్‌నుమా’ ముస్తాబు
హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ సోదరి వివాహానికి హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ ముస్తాబవుతోంది. ఈ నెల 17,18 తేదీల లో ప్యాలెస్‌లో జరిగే వివాహ వేడుకకు దేశంలోని ప్రముఖ రాజకీయనాయకులు, సినీతారలు హాజరుకానున్నారు. ప్యాలెస్‌లోని అన్ని గదులను రెండు రోజుల పాటు బుక్ చేసినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. వివాహ వేడుకకు 200 నుంచి 250 మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడిం చారు. ప్యాలెస్ అద్దె రూ. 2 కోట్లను ఇప్పటికే సల్మాన్‌ఖాన్ ముంబైలోని తాజ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో చెల్లించినట్లు విశ్వసనీయంగా తెలి సింది. కాగా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బందోబస్తు కోసం ఇప్పటికే తమకు దరఖాస్తు అందిందని దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. -
అర్పితా టేస్ట్...
సల్మాన్‌ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ ఢిల్లీకి చెందిన తన బాయ్‌ఫ్రెండ్ ఆయుష్ శర్మను వచ్చే ఏడాది పెళ్లాడనుంది. ఈ పెళ్లి హైదరాబాద్‌లో జరగనుండటం విశేషం. హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను అర్పితా తన పెళ్లి వేదికగా ఎంపిక చేసుకుంది. ఆమె కోరిక మేరకు సల్మాన్ కుటుంబ సభ్యులు ఫలక్‌నుమా హోటల్ యాజమాన్యంతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు సమాచారం.