సల్మాన్ సోదరి పెళ్లికి ‘ఫలక్‌నుమా’ ముస్తాబు | Taj Falaknuma Palace to be ready for Salman Khan's sister marriage | Sakshi
Sakshi News home page

సల్మాన్ సోదరి పెళ్లికి ‘ఫలక్‌నుమా’ ముస్తాబు

Published Thu, Nov 13 2014 3:19 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Taj Falaknuma Palace to be ready for Salman Khan's sister marriage

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ సోదరి వివాహానికి హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ ముస్తాబవుతోంది. ఈ నెల 17,18 తేదీల లో ప్యాలెస్‌లో జరిగే వివాహ వేడుకకు దేశంలోని ప్రముఖ రాజకీయనాయకులు, సినీతారలు హాజరుకానున్నారు.  ప్యాలెస్‌లోని అన్ని గదులను రెండు రోజుల పాటు బుక్ చేసినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. వివాహ వేడుకకు 200 నుంచి 250 మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడిం చారు. ప్యాలెస్ అద్దె రూ. 2 కోట్లను ఇప్పటికే సల్మాన్‌ఖాన్ ముంబైలోని తాజ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో చెల్లించినట్లు విశ్వసనీయంగా తెలి సింది. కాగా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బందోబస్తు కోసం ఇప్పటికే తమకు దరఖాస్తు అందిందని దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement