ప్లేట్లు నేలకేసి కొట్టిన హీరో‌ సోదరి! | Salman Khan Sister Arpita Smashing Plates In Restaurant Goes Viral | Sakshi
Sakshi News home page

ప్లేట్లు పగులగొడుతూ డ్యాన్స్‌.. వైరల్‌!

Published Mon, Dec 7 2020 4:56 PM | Last Updated on Mon, Dec 7 2020 5:14 PM

Salman Khan Sister Arpita Smashing Plates In Restaurant Goes Viral - Sakshi

అబుదాబి: చేతికి అందిన ప్లేట్లను అందినట్లుగా నేలకేసి కొట్టారు బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ శర్మ. ఆ తర్వాత స్నేహితులతో కలిసి డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అసలు విషయమేమిటంటే.. అర్పితా ఖాన్‌ శర్మ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో తన ఫ్రెండ్స్‌లో కలిసి స్థానిక రెస్టారెంటుకు వెళ్లారు.  ఇక అప్పటికే అక్కడ ప్లేట్లు పగులకొట్టే కార్యక్రమం మొదలైంది. దీంతో అర్పిత కూడా అందులో భాగమయ్యారు.  ఆ తర్వాత మ్యూజిక్‌ వింటూ అందుకు అనుగుణంగా స్టెప్పులేశారు. కాగా గ్రీకు ఆచారం ప్రకారం.. దుష్టశక్తులను పారద్రోలేందుకు ఇలా ప్లేట్లను పగులగొడుతూ ఉంటారు. (చదవండి: మద్యం మత్తులో ఎస్సైపై యువతి దాడి)

కాగా అర్పితా ఖాన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తమ కుటుంబానికి సంబంధించిన అప్‌డేట్లు తెలియజేస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా భాయీజాన్‌ సల్మాన్‌తో తన అనుబంధం, తన పిల్లలతో సల్లూభాయ్‌ ఎంజాయ్‌ చేస్తున్న వీడియోలు తరచుగా షేర్‌ చేస్తూ ఉంటారు. ఇక అర్పిత సల్మాన్‌ సొంత చెల్లెలు కాదన్న సంగతి తెలిసిందే. ఖాన్‌ కుటుంబం ఆమెను దత్తత తీసుకుంది.  కాగా 2014లో ఆయుష్‌ శర్మతో అర్పిత పెళ్లి సందర్భంగా దాదాపు రూ.16 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను సల్మాన్‌ చెల్లెలికి బహుమతిగా ఇవ్వడం అప్పట్లో వైరలైన సంగతి తెలిసిందే. (చదవండిటీవీ నటి దివ్య భట్నాగర్‌ మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement