ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మరో వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నాడట. ఈ విషయాన్ని ఆయన సోదరి అర్పిత ఖాన్ స్వయంగా వెల్లడించింది. ' రీటైల్ జ్యుయెల్లరీ ఇండియా 2016' అవార్డుల కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని ప్రకటించింది. సల్మాన్ ఖాన్ ఫామస్ బ్రాండ్ ది బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ద్వారా నగల వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నట్టు తెలిపింది. తమకెంతో ఇష్టమైన జ్యుయెల్లరీ బిజెనెస్ ను వచ్చే త్వరలోనే లాంచ్ చేయనున్నామని చెప్పింది. అందుకే తాను ఈ ఈవెంట్ కి హాజరయ్యానని వివరించింది.
వచ్చే నెల నుంచే ఆభరణాల పరిశ్రమలోకి ప్రవేశించనున్నామని ప్రకటించిన అర్పిత బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ఉత్పత్తులు సరసమైన ధరలతో అన్ని రకాల వినియోగదారులకు అందుబాటులో వుండేలా చూస్తామన్నారు. ముఖ్యంగా 70 శాతం మహిళల కోసం 30శాతం పురుషులకుపయోగపడేలా తమ కలెక్షన్ ఉండబోతోందన్నారు. నటి ఇషా డియోల్, దర్శకుడు దివ్య ఖోస్లా కుమార్ అవార్డుల ప్యానెల్ లో జ్యూరీ సభ్యులుగా ఉన్నారు.
కాగా బీయింగ్ హ్యూమన్ అని రాసి ఉన్న టీషర్ట్ లతో సల్మాన్ వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. దీని ద్వారా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నాడు. మరోవైపు 1998 నాటి కృష్ణజింకలు, చింకారలని వేటాడి చంపినట్టుగా నమోదైన అభియోగాలను విచారించిన రాజస్థాన్ హై కోర్టు సల్మాన్ కు భారీ ఊరట నిచ్చింది. కింది కోర్టు తీర్పును కొట్టివేసిన హైకోర్టు... దోషిగా తేల్చడానికి సరైన ఆధారాలు లేవంటూ, సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరో కొత్త వ్యాపారంలోకి సల్మాన్
Published Wed, Jul 27 2016 12:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
Advertisement