Being Human
-
మొబైల్ రంగంలోకి బాలీవుడ్ ఖాన్
వరుస సక్సెస్‌లతో ఫుల్ ఫాంలో ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సినిమాలతో పాటు వ్యాపార రంగం మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే బీయింగ్ హ్యూమన్ పేరుతో పలు ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న సల్మాన్, తాజాగా మొబైల్ రంగం మీద దృష్టిపెట్టాడు. ఇటీవల బీయింగ్ ఇన్ టచ్ అనే యాప్ విడుదల చేసిన కండల వీరుడు, త్వరలో మొబైల్ బ్రాండ్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ మొబైల్ కంపెనీ కోసం బీయింగ్ స్మార్ట్ అనే ట్రేడ్ మార్క్‌ను సైతం రిజిస్టర్ చేయించాడు. పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకువచ్చే ప్లాన్‌లో ఉన్నాడు సుల్తాన్. బీయింగ్ హ్యూమన్ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సల్మాన్, తన కంపెనీల ద్వారా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాడు. -
ఫ్యాన్స్‌కు సల్మాన్ బర్త్‌డే గిఫ్ట్..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ శాంతాక్లాజ్‌గా మారిపోయారు. ఎవరైనా బర్త్‌డేకి బహుమతులు పుచ్చుకుంటారు. కానీ ఈ కండలవీరుడు తన 51వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు. అయితే ఆ గిఫ్ట్ ఏమిటో తెలుసా? సల్మాన్‌ఖాన్ సొంత దుస్తుల బ్రాండు 'బీయింగ్ హ్యుమన్' పై స్పెషల్ డిస్కౌంట్లు. బీయింగ్ హ్యుమన్ ఫ్లాట్‌పై 51 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా అభిమానులకు తన సర్ఫ్రైజ్ గిఫ్ట్‌ను రివీల్ చేశాడు. ప్రత్యేకంగా ఆన్లైన్ మింత్రాలో కూడా ఈ డిస్కౌంట్లు అందించనున్నట్టు తెలిపాడు. 'గెట్ రెడీ ఫర్ బిగ్ బర్త్ డే సర్ఫ్రైజ్' అంటూ అభిమానులకు అంతకముందే సల్లూభాయ్ ట్వీట్ చేశాడు. ఈ సర్‌ఫ్రైజ్‌ను ట్విట్టర్ ద్వారా తెలిపేశాడు. సామాజిక సేవలో భాగంగా బీయింగ్ హ్యుమన్ ఫౌండేషన్‌ను ప్రారంభించిన సల్లూభాయ్, దీన్ని సేవలను మరింత విస్తరించడానికి ఈ బ్రాండు పేరుతోనే జువెల్లరీ రంగంలోకి సల్మాన్ అడుగుపెడుతున్న్డు. బర్త్‌డే సందర్భంగా బీయింగ్ హ్యుమన్ ఫౌండేషన్, స్టైయిల్ క్వాటియంట్ జువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో బీయింగ్ హ్యుమన్ ఫ్యాషన్ జువెల్లరీని లాంచ్ చేస్తున్నాడు. Celebrate my birthday with Flat 51% Off at @bebeinghuman stores and exclusively online @Myntra https://t.co/3Uc5Wgncbf #2712 pic.twitter.com/mQsk7kU4Sr — Salman Khan (@BeingSalmanKhan) December 26, 2016 -
మరో కొత్త వ్యాపారంలోకి సల్మాన్
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మరో వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నాడట. ఈ విషయాన్ని ఆయన సోదరి అర్పిత ఖాన్ స్వయంగా వెల్లడించింది. ' రీటైల్ జ్యుయెల్లరీ ఇండియా 2016' అవార్డుల కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని ప్రకటించింది. సల్మాన్ ఖాన్ ఫామస్ బ్రాండ్ ది బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ద్వారా నగల వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నట్టు తెలిపింది. తమకెంతో ఇష్టమైన జ్యుయెల్లరీ బిజెనెస్ ను వచ్చే త్వరలోనే లాంచ్ చేయనున్నామని చెప్పింది. అందుకే తాను ఈ ఈవెంట్ కి హాజరయ్యానని వివరించింది. వచ్చే నెల నుంచే ఆభరణాల పరిశ్రమలోకి ప్రవేశించనున్నామని ప్రకటించిన అర్పిత బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ఉత్పత్తులు సరసమైన ధరలతో అన్ని రకాల వినియోగదారులకు అందుబాటులో వుండేలా చూస్తామన్నారు. ముఖ్యంగా 70 శాతం మహిళల కోసం 30శాతం పురుషులకుపయోగపడేలా తమ కలెక్షన్ ఉండబోతోందన్నారు. నటి ఇషా డియోల్, దర్శకుడు దివ్య ఖోస్లా కుమార్ అవార్డుల ప్యానెల్ లో జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. కాగా బీయింగ్ హ్యూమన్ అని రాసి ఉన్న టీషర్ట్ లతో సల్మాన్ వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. దీని ద్వారా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నాడు. మరోవైపు 1998 నాటి కృష్ణజింకలు, చింకారలని వేటాడి చంపినట్టుగా నమోదైన అభియోగాలను విచారించిన రాజస్థాన్ హై కోర్టు సల్మాన్ కు భారీ ఊరట నిచ్చింది. కింది కోర్టు తీర్పును కొట్టివేసిన హైకోర్టు... దోషిగా తేల్చడానికి సరైన ఆధారాలు లేవంటూ, సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మరో కేసులో సల్మాన్ ఖాన్..?
ఈమధ్యే ఓ కోర్టు వివాదం నుంచి బయటపడిన సల్మాన్ ఖాన్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చేలా ఉంది. ఇటీవల తన 50వ పుట్టిన రోజు సందర్భంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు సల్మాన్ ఖాన్. ఆన్లైన్ మార్కెటింగ్‌లో అడుగుపెట్టిన సల్లూభాయ్, ఖాన్ మార్కెట్ ఆన్లైన్ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. అయితే వెబ్సైట్ ద్వారా ఇంకా అమ్మకాలు ప్రారంభం కాకపోయినా వివాదాలు మాత్రం ప్రారంభమయ్యాయి. గత 65 ఏళ్లుగా ఢిల్లీ వేదికగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఖాన్ మార్కెట్ సంస్థ తమ బ్రాండ్ నేమ్‌ను వాడుకోవటంపై అభ్యంతరం తెలిపింది. ఈ సందర్భంగా ఖాన్ మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సల్మాన్‌ను తన ఆలోచనను వెనక్కు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో తాము కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపారు. అయితే ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న సల్మాన్ టెక్నికల్ టీం ఇప్పుడు పేరు మార్చటం కుదరదని చెపుతున్నారు. ఖాన్ మార్కెట్ నిర్వహకులు మాత్రం తామ బ్రాండ్ వాడుకోవద్దంటూ గట్టిగా చెపుతున్నారు. బీయింగ్ హ్యూమన్ అంటూ ప్రచారం చేస్తున్నసల్మాన్, తానే ఆ విలువలు పాటించకపోవటం కరెక్ట్ కాదని, పొరాపాటుగా తమ బ్రాండ్ వాడుకొని ఉన్నా, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాలని చెపుతున్నారు. లేని పక్షంలో లీగల్‌గా చర్యలు తీసుకుంటున్నామని తేల్చి చెప్పారు. -
హాఫ్ సెంచరీ కొట్టిన సల్మాన్
2015లో భారీ సక్సెస్‌లతో అలరించిన సల్మాన్ ఖాన్, ఈ ఏడాది మరో మెమరబుల్ మార్క్‌ను రీచ్ అయ్యాడు. ఈ ఆదివారం ( డిసెంబర్ 27) తన 50వ పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్నాడు. ఇప్పటికీ బాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న సల్లూ భాయ్, గోల్డెన్ జూబ్లీ బర్తే డే సెలబ్రేషన్స్‌ను భారీగా నిర్వహించడానికి అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ వెబ్ సైట్లలో సల్మాన్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ పోస్ట్‌లు వెళ్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు బీటౌన్ సెలబ్రిటీలు కూడా సల్మాన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు సల్మాన్ పాల్గొనే పుట్టిన రోజుక వేడుకలపై ఎలాంటి సమాచారం లేకపోవటంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం సుల్తాన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సల్మాన్, ఈ సారి తన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవటం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి కొంత మంది సల్మాన్ పుట్టిన రోజును బిగ్‌బాస్ 9 సెట్లో చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా చెబుతున్నారు. సల్మాన్ టీం నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం లేదు. ఈ సారి సల్మాన్ జరుపుకుంటున్న పుట్టినరోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. చాలా రోజులుగా సల్మాన్ ను ఇబ్బంది పెడుతున్న కోర్ట్ కేసుల నుంచి కండలవీరుడికి విముక్తి లభించటంతో పాటు సల్మాన్ జీవితకథ బీయింగ్ హ్యూమన్ పేరుతో పుస్తక రూపంలో రిలీజ్ అవుతోంది. ఇలా వరుస సక్సెస్‌లతో పుట్టిన రోజును గ్రాండ్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు సల్లూ భాయ్. -
నా జీతం ఎంతైతే మీకెందుకు..?
మీడియాతో ఎప్పుడు మాట్లాడినా సరదాగా ఎంటర్టైన్ చేసే సల్మాన్ ఖాన్ ఈ సారి కాస్త వేడి పెంచాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియా మీద సెటైర్లు వేస్తూ అలరించాడు. ప్రస్తుతం తన హీరోగా నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాతో పాటు తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'బిగ్ బాస్ 9' ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు సల్మాన్. వరుస ప్రమోషన్ ఈవెంట్లతో రెగ్యులర్ గా మీడియాతో కలుస్తున్న సల్మాన్ ఇటీవల ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'మీ జీతాల విషయంలో నాకు ఎలాంటి ఆసక్తి లేదు.. మరి మీకు మాత్రం నా జీతం విషయంలో అంత ఇంట్రస్ట్ ఎందుకు' అంటూ చురకలంటించాడు.'నా రెమ్యూనరేషన్ పెరిగినా అది నాతో ఉండదు బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కే వెళ్తుంది. ఓ మంచి పని కోసం ఉపయోగపడుతుంది' అని వివరించాడు. బాలీవుడ్లో బ్యాడ్‌బాయ్ ఇమేజ్ ఉన్న సల్మాన్ 2007లో కొన్ని ఇతర సంస్థలతో కలిసి బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్న ఎంతో మందికి విద్యా, వైద్య సేవలు అందిస్తున్నారు. -
హ్యాట్సాఫ్.. త్రివిక్రమ్!
హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి చిన్నారుల కుటుంబాలకు అమూల్యమైన సమాచారాన్ని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ఆర్ధిక సమస్యలతో సతమతమవుతూ గుండె సంబంధిత వ్యాధితో బాధపడే చిన్నారులకు బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ సహాయం చేస్తుందని త్రివిక్రమ్ సోషల్ మీడియా వెబ్ సైట్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆర్ధిక సహాయాన్ని పొందుటకు beinghumanemail@gmail.com ఈమెయిల్ ద్వారా వారిని సంప్రదించాలని త్రివిక్రమ్ సూచించారు. త్రివిక్రమ్ తీసుకున్న చొరవపట్ల పలువురు సోషల్ మీడియా ఫాలోవర్స్, ఇతర నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. If any kids who has a heart condition n can't afford to get it treated,send the details to beinghumanemail@gmail.com.They will help you — Trivikram (@4ever_PK) July 29, 2014 -
సల్మాన్ అభిమానులకు ఉద్యోగాలు!
కండలవీరుడు సల్మాన్‌ఖాన్ గుండె బండరాయి అని చాలామంది అనుకుంటారు. కానీ, ఆయన తెరవెనుక చేపట్టే సేవా కార్యక్రమాల గురించి వింటే మాత్రం ఎవ్వరూ ఆ మాట అనరు, ‘బీయింగ్ హ్యూమన్’ అనే సంస్థ ఆరంభించి, పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సల్మాన్. ఇప్పటివరకు ఎంతోమందిని ఆదుకున్న సల్మాన్ ఇప్పుడు ప్రత్యేకంగా తన అభిమానుల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పదంటారు. సల్మాన్ ఆల్రెడీ చాలామందికి ఆ దానం చేస్తున్నారు. అది మాత్రమే కాదు.. ఉన్నత చదువులు చదువుకుని నిరుద్యోగులుగా మిగిలిపోయిన తన అభిమానుల కోసం ఉద్యోగ ప్రాప్తిరస్తు పథకం మొదలుపెట్టారు. దీనికోసం ఓ జాబ్ పోర్టల్ ఆరంభించారు. సల్మాన్ పేరున్న స్టార్ కాబట్టి, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలవారితో సత్సంబంధాలుంటాయి. వారి కంపెనీలో ఉన్న ఖాళీలను తన అభిమానులతో భర్తీ చేయమని కోరారట సల్మాన్. అభిమాన నాయకుడు తమ కోసం ఇలా చేయడం అభిమానులను సంతోషపెడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బహుశా ఇప్పటివరకూ ఏ హీరో కూడా ఇలాంటి ఓ పథకం ప్రవేశపెట్టి ఉండరేమో. -
మాటిచ్చాడు...మర్చిపోయాడు!
‘‘మనిషిలా ఉండు.. ఇతరులకు సహాయం చెయ్యి’’ అని చెబుతున్నట్లుగా తన సేవాసంస్థకు ‘బీయింగ్ హ్యూమన్’ అని పేరు పెట్టుకున్నారు సల్మాన్‌ఖాన్. ఈ సంస్థద్వారా పలు సేవాకార్యక్రమాలు చేస్తుంటారాయన.సహాయం చేస్తానని ఎవరికైనా మాటిస్తే.. అది నెరవేర్చుకుంటారట. కానీ, ఒక ప్రొఫెసర్ విషయంలో మాత్రం సల్మాన్ మాట తప్పారు. వెనకబడిన వర్గాల కుటుంబాలకు చెందిన పిల్లలకు పాఠశాలలు ఏర్పాటు చేయాలనే సదాశయంతో ఆ ప్రొఫెసర్ నిధి సమకూర్చుకుంటున్నారు. దీనికోసం చర్చ్ గేట్ నుంచి గుర్గావ్ వరకు ప్రతిరోజూ ఆరు గంటలు రైలు ప్రయాణం చేస్తుంటారాయన. 2010లో ఓ సందర్భంలో సల్మాన్‌ఖాన్ కంటపడ్డారు. ఆయన్నుంచి విషయం మొత్తం తెలుసుకుని ‘నేను సహాయం చేస్తా’ అని మాటిచ్చేశారు సల్మాన్‌ఖాన్. ఇది జరిగి నాలుగేళ్లవుతున్నా ఇంకా సహాయం అందలేదని, సల్మాన్ ఈ విధంగా చేయడం బాధపెట్టిందని ఇటీవల ఆ ప్రొఫెసర్ బహిరంగంగా పేర్కొన్నారు. ఈ విషయం సల్మాన్ వరకు వెళ్లింది. పనుల ఒత్తిడితో మర్చిపోయానని, జరిగిన పొరపాటుకి బాధపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, త్వరలో ప్రొఫెసర్ని కలిసి, సహాయం చేయబోతున్నామని సల్మాన్ మేనేజర్ పేర్కొన్నారు.