మరో కేసులో సల్మాన్ ఖాన్..?
ఈమధ్యే ఓ కోర్టు వివాదం నుంచి బయటపడిన సల్మాన్ ఖాన్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చేలా ఉంది. ఇటీవల తన 50వ పుట్టిన రోజు సందర్భంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు సల్మాన్ ఖాన్. ఆన్లైన్ మార్కెటింగ్లో అడుగుపెట్టిన సల్లూభాయ్, ఖాన్ మార్కెట్ ఆన్లైన్ పేరుతో ఓ వెబ్సైట్ను ప్రారంభించాడు. అయితే వెబ్సైట్ ద్వారా ఇంకా అమ్మకాలు ప్రారంభం కాకపోయినా వివాదాలు మాత్రం ప్రారంభమయ్యాయి.
గత 65 ఏళ్లుగా ఢిల్లీ వేదికగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఖాన్ మార్కెట్ సంస్థ తమ బ్రాండ్ నేమ్ను వాడుకోవటంపై అభ్యంతరం తెలిపింది. ఈ సందర్భంగా ఖాన్ మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సల్మాన్ను తన ఆలోచనను వెనక్కు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో తాము కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపారు. అయితే ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న సల్మాన్ టెక్నికల్ టీం ఇప్పుడు పేరు మార్చటం కుదరదని చెపుతున్నారు.
ఖాన్ మార్కెట్ నిర్వహకులు మాత్రం తామ బ్రాండ్ వాడుకోవద్దంటూ గట్టిగా చెపుతున్నారు. బీయింగ్ హ్యూమన్ అంటూ ప్రచారం చేస్తున్నసల్మాన్, తానే ఆ విలువలు పాటించకపోవటం కరెక్ట్ కాదని, పొరాపాటుగా తమ బ్రాండ్ వాడుకొని ఉన్నా, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాలని చెపుతున్నారు. లేని పక్షంలో లీగల్గా చర్యలు తీసుకుంటున్నామని తేల్చి చెప్పారు.