మొబైల్ రంగంలోకి బాలీవుడ్ ఖాన్ | Salman Khan to launch a Smartphone called Being Smart | Sakshi
Sakshi News home page

మొబైల్ రంగంలోకి బాలీవుడ్ ఖాన్

Published Thu, Mar 9 2017 3:36 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

మొబైల్ రంగంలోకి బాలీవుడ్ ఖాన్ - Sakshi

మొబైల్ రంగంలోకి బాలీవుడ్ ఖాన్

వరుస సక్సెస్లతో ఫుల్ ఫాంలో ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సినిమాలతో పాటు వ్యాపార రంగం మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే బీయింగ్ హ్యూమన్ పేరుతో పలు ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న సల్మాన్, తాజాగా మొబైల్ రంగం మీద దృష్టిపెట్టాడు. ఇటీవల బీయింగ్ ఇన్ టచ్ అనే యాప్ విడుదల చేసిన కండల వీరుడు, త్వరలో మొబైల్ బ్రాండ్ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ మొబైల్ కంపెనీ కోసం బీయింగ్ స్మార్ట్ అనే ట్రేడ్ మార్క్ను సైతం రిజిస్టర్ చేయించాడు. పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకువచ్చే ప్లాన్లో ఉన్నాడు సుల్తాన్. బీయింగ్ హ్యూమన్ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సల్మాన్, తన కంపెనీల ద్వారా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement