Jewellery Industry
-
పసిడిపై దిగుమతి సుంకాలు తగ్గించాలి..
భారత్ ఏటా 800–900 టన్నుల పసిడి దిగుమతి చేసుకుంటోంది. 2018–19లో పసిడి దిగుమతులు 22.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారీగా పెరుగుతున్న కరెంటు అకౌంటు లోటును కట్టడి చేసే దిశగా పసిడిపై విధించిన సుంకాలతో.. దిగుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో 7 శాతం క్షీణించి 20.57 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అదే సమయంలో వజ్రాభరణాల దిగుమతులు కూడా 1.5 శాతం క్షీణించి 20.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో పసిడి, వజ్రాభరణాల వ్యాపార సంస్థలు కేంద్ర ప్రభుత్వం ముందు పలు విజ్ఞప్తులు ఉంచాయి. ►బంగారంపై 12.5 శాతం దిగుమతి సుంకాల (జీఎస్టీ అదనం)తో ఆభరణాల కొనుగోలు భారీ వ్యయాలతో కూడుకున్నదిగా మారిపోయింది. దీన్ని 6 శాతానికి తగ్గించాలి. కట్, పాలిష్డ్ డైమండ్స్‌పై సుంకాలను 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలి. ►కొనుగోళ్లకు క్రెడిట్ కార్డును వినియోగించిన పక్షంలో బ్యాంక్ కమీషన్లు తొలగించాలి. లేదా ప్రస్తుతమున్న 1–1.5 శాతం నుంచి 0.20 శాతానికి తగ్గించాలి. ►ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని కొత్త ఆభరణాల్లో ఇన్వెస్ట్ చేసిన పక్షంలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలి. ►పసిడి పరిశ్రమ మరింత పారదర్శకంగా పనిచేసే విధంగా తగిన ఇన్ఫ్రా, ప్రమాణాలను నెలకొల్పాలి. భారీ స్థాయి గోల్డ్ స్పాట్ ఎక్సే్చంజ్, బులియన్ బ్యాంకింగ్ మొదలైనవి పటిష్టం చేయాలి. -
మరో కొత్త వ్యాపారంలోకి సల్మాన్
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మరో వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నాడట. ఈ విషయాన్ని ఆయన సోదరి అర్పిత ఖాన్ స్వయంగా వెల్లడించింది. ' రీటైల్ జ్యుయెల్లరీ ఇండియా 2016' అవార్డుల కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని ప్రకటించింది. సల్మాన్ ఖాన్ ఫామస్ బ్రాండ్ ది బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ద్వారా నగల వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నట్టు తెలిపింది. తమకెంతో ఇష్టమైన జ్యుయెల్లరీ బిజెనెస్ ను వచ్చే త్వరలోనే లాంచ్ చేయనున్నామని చెప్పింది. అందుకే తాను ఈ ఈవెంట్ కి హాజరయ్యానని వివరించింది. వచ్చే నెల నుంచే ఆభరణాల పరిశ్రమలోకి ప్రవేశించనున్నామని ప్రకటించిన అర్పిత బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ఉత్పత్తులు సరసమైన ధరలతో అన్ని రకాల వినియోగదారులకు అందుబాటులో వుండేలా చూస్తామన్నారు. ముఖ్యంగా 70 శాతం మహిళల కోసం 30శాతం పురుషులకుపయోగపడేలా తమ కలెక్షన్ ఉండబోతోందన్నారు. నటి ఇషా డియోల్, దర్శకుడు దివ్య ఖోస్లా కుమార్ అవార్డుల ప్యానెల్ లో జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. కాగా బీయింగ్ హ్యూమన్ అని రాసి ఉన్న టీషర్ట్ లతో సల్మాన్ వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. దీని ద్వారా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నాడు. మరోవైపు 1998 నాటి కృష్ణజింకలు, చింకారలని వేటాడి చంపినట్టుగా నమోదైన అభియోగాలను విచారించిన రాజస్థాన్ హై కోర్టు సల్మాన్ కు భారీ ఊరట నిచ్చింది. కింది కోర్టు తీర్పును కొట్టివేసిన హైకోర్టు... దోషిగా తేల్చడానికి సరైన ఆధారాలు లేవంటూ, సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
61 శాతం పెరిగిన పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంక్ దిగుమతుల నిబంధనలను సడలించడం, అంతర్జాతీయంగా ధరలు క్షీణించడం వంటి పలు అంశాల వల్ల దేశంలోకి పసిడి దిగుమతి బాగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి రెండు మాసాల్లో (ఏప్రిల్-మే) బంగారం దిగుమతి 61% వృద్ధితో 155 టన్నులకు చేరింది. గతేడాది ఇదే సమయంలో బంగారం దిగుమతి 96 టన్నులు. జ్యూయలరీ పరిశ్రమ నుంచి డిమాండ్ అధికంగా ఉండటం వల్ల బంగారం దిగుమతి బాగా పెరిగింది. బంగారం దిగుమతి 2013-14 ఆర్థిక సంత్సరంలో 662 టన్నులుగా, 2014-15లో 916 టన్నులుగా ఉంది. అధిక మొత్తంలో బంగారం దిగుమతి ప్రభావం దేశ కరెంటు ఖాతా లోటుపై ఉంటుంది. 2013-14లో 1.7%గా ఉన్న కరెంటు ఖాతా లోటు 2014-15లో 1.3%కి తగ్గింది.