
చెల్లెలికి రూ. 16 కోట్ల ఫ్లాట్ బహుమతి
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ సోదరి అర్పితా ఖాన్ - ఆయుష్ శర్మల పెళ్లి కార్యక్రమం వైభవంగా జరిగింది. దీనికి పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. తన గారాల చెల్లెలి పెళ్లి సందర్భంగా సల్మాన్ ఆమెకు 16 కోట్ల రూపాయల విలువ చేసే టెర్రెస్ ఫ్లాట్ను కానుకగా ఇచ్చారు. ఈ ఫ్లాట్ ముంబైలో ఉంది. దాని తాళాలను పెళ్లిలో అర్పితకు ఇచ్చారు.
రాత్రి ఏడు గంటలకు బారాత్ ప్రారంభం అవుతోంది. ఈ వినోద కార్యక్రమంలో సల్లూభాయ్తో పాటు.. బాలీవుడ్ నటీమణులు మలైకా అరోరా ఖాన్, అమృతా అరోరా తదితరులు కూడా డాన్సులు చేస్తున్నారు. కాగా, సోమవారం ముంబైలో జరిగిన సంగీత్ కార్యక్రమంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ షీలాకీ జవానీ పాటకు డాన్సు చేసింది.