
Salman Khan In Latest Video Said All His Girlfriends Are Now Married: బాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అంటే టక్కున గుర్తు వచ్చేది సల్మాన్ ఖాన్. సల్లూ భాయ్ వివాహం ఎప్పుడూ జరుగుతుందా అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. భాయిజాన్ పెళ్లీ పీటలు ఎక్కితే చూడాలని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్స్, వివాహంపై వచ్చే రూమర్స్, ఫేక్ న్యూస్‌లు సైతం ట్రెండింగ్‌లో ఉంటాయి. దీన్ని బట్టే అర్థమవుతోంది ఆయన షాదీ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారనేది. అయితే సల్లూ భాయ్ పెళ్లిపై ఫ్యాన్స్, ప్రేక్షకులు, బంధువులకే కాకుండా తాజాగా మరో వ్యక్తికి కూడా ఆసక్తి ఉంది. అతనెవరో కాదు సల్మాన్ ఖాన్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన 'హమ్ ఆప్కే హై కౌన్' సినిమాలోని 'ప్రేమ్'. అవును. కాస్త వింతగా ఉంది కదూ. కానీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా సల్మాన్ ఖాన్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే నమ్మకుండా మానరు.
సల్మాన్ ఖాన్ సోమవారం (మార్చి 7) 'హమ్ ఆప్కే హై కౌన్' చిత్రంలోని ప్రేమ్ పాత్రను కలుసుకున్న వీడియోను షేర్ చేశాడు. అందులో సల్లూ భాయ్ తన భవిష్యత్తులో ఏం జరిగిందో ప్రేమ్‌కు చెబుతున్నట్లుగా ఉంది. ఈ వీడియోలో ప్రేమ్.. ఫ్యూచర్ నుంచి వచ్చిన సల్మాన్‌ను 'నువ్వు పెళ్లి చేసుకున్నావా' అని ఆత్రంగా అడుగుతాడు. అందుకు ఫ్యూచర్ సల్మాన్ 'పెళ్లయింది. నీ గర్ల్‌ఫ్రెండ్స్ అందరికీ' అని సమాధానం ఇస్తాడు. అందుకు ప్రేమ్ నిరాశ చెందుతాడు. ఇదిలా ఉంటే 80వ దశకంలో సల్మాన్ ఖాన్ నటి సంగీతా బిజ్లానీతో డేటింగ్ చేశాడు. తర్వాత సోమీ అలీ, ఐశ్వర్య రాయ్, కత్రీనా కైఫ్‌లతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప‍్రస్తుతం సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జోడిగా అలరించేందుకు 'టైగర్ 3' సినిమాతో రెడీగా ఉన్నారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 21, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment