girlfriends
-
తన గర్ల్‌ఫ్రెండ్స్ అందరికీ పెళ్లయిందన్న హీరో.. వీడియో వైరల్
Salman Khan In Latest Video Said All His Girlfriends Are Now Married: బాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అంటే టక్కున గుర్తు వచ్చేది సల్మాన్ ఖాన్. సల్లూ భాయ్ వివాహం ఎప్పుడూ జరుగుతుందా అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. భాయిజాన్ పెళ్లీ పీటలు ఎక్కితే చూడాలని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్స్, వివాహంపై వచ్చే రూమర్స్, ఫేక్ న్యూస్‌లు సైతం ట్రెండింగ్‌లో ఉంటాయి. దీన్ని బట్టే అర్థమవుతోంది ఆయన షాదీ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారనేది. అయితే సల్లూ భాయ్ పెళ్లిపై ఫ్యాన్స్, ప్రేక్షకులు, బంధువులకే కాకుండా తాజాగా మరో వ్యక్తికి కూడా ఆసక్తి ఉంది. అతనెవరో కాదు సల్మాన్ ఖాన్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన 'హమ్ ఆప్కే హై కౌన్' సినిమాలోని 'ప్రేమ్'. అవును. కాస్త వింతగా ఉంది కదూ. కానీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా సల్మాన్ ఖాన్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే నమ్మకుండా మానరు. సల్మాన్ ఖాన్ సోమవారం (మార్చి 7) 'హమ్ ఆప్కే హై కౌన్' చిత్రంలోని ప్రేమ్ పాత్రను కలుసుకున్న వీడియోను షేర్ చేశాడు. అందులో సల్లూ భాయ్ తన భవిష్యత్తులో ఏం జరిగిందో ప్రేమ్‌కు చెబుతున్నట్లుగా ఉంది. ఈ వీడియోలో ప్రేమ్.. ఫ్యూచర్ నుంచి వచ్చిన సల్మాన్‌ను 'నువ్వు పెళ్లి చేసుకున్నావా' అని ఆత్రంగా అడుగుతాడు. అందుకు ఫ్యూచర్ సల్మాన్ 'పెళ్లయింది. నీ గర్ల్‌ఫ్రెండ్స్ అందరికీ' అని సమాధానం ఇస్తాడు. అందుకు ప్రేమ్ నిరాశ చెందుతాడు. ఇదిలా ఉంటే 80వ దశకంలో సల్మాన్ ఖాన్ నటి సంగీతా బిజ్లానీతో డేటింగ్ చేశాడు. తర్వాత సోమీ అలీ, ఐశ్వర్య రాయ్, కత్రీనా కైఫ్‌లతో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జోడిగా అలరించేందుకు 'టైగర్ 3' సినిమాతో రెడీగా ఉన్నారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 21, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మందుకు రానుంది. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) -
సంజుకు 308 మంది లవర్స్.. నా లిస్ట్ పదిలోపే!
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సీనియర్ హీరో సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటివరకు మున్నాభాయ్ సిరీస్, త్రీ ఇడియట్స్, పీకే వంటి అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కింది. స్టార్ కిడ్‌గా సినీ రంగ ప్రవేశం చేసి.. అనేక విజయాలు, పరాజయాలు అందుకొని.. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన సంజయ్ దత్ జీవితకథను దర్శకుడు హిరానీ ఎంతో ఆసక్తికరంగా దృశ్యరూపం ఇచ్చాడు. నూటికినూరు శాతం సంజు పాత్రలో జీవించాడా? అన్నస్థాయిలో రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో నటించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సంజయ్ దత్ తనకు 308 మంది ప్రియురాళ్లు ఉన్నట్టు నిజాయితీగా వెల్లడించాడు. మీ బయోపిక్ వస్తే.. మీకు ఎంతమంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారో నిజాయితీగా వెల్లడిస్తారా? అని ఓ విలేకరి అడుగగా.. సంజుకు 308 మంది ఉన్నారు. కానీ, తన ప్రియురాళ్ల సంఖ్య ఇంకా పదికి కూడా చేరలేదని రణ్‌బీర్ చెప్పాడు. సంజుభాయ్కి ఎంతో ధైర్యం ఉంది కాబట్టి జీవితకథను సినిమాగా తెరకెక్కించేందుకు అనుమతించాడని, కానీ తన జీవితకథ ఎప్పటికీ బయోపిక్‌గా తెరకెక్కబోదని, అందుకు తాను అంగీకరించనని రణ్‌బీర్ కపూర్ చెప్పాడు. తన జీవితంలోని రహస్యాలను బట్టబయలుచేసే ధైర్యం తనకు లేదన్నాడు. -
అక్కడ ఇద్దరు లేక ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్
గ్వాంగ్డాంగ్: దక్షిణ చైనాలోని డాంగ్వాన్ నగరం మొన్నటి వరకు ప్రపంచ ఉత్పత్తుల కేంద్రం లేదా పపంచ ఫ్యాక్టరీగానే ప్రపంచానికి తెలుసు. ఇప్పుడది గర్ల్ ఫ్రెండ్స్ నగరంగా, సెక్స్ కాపిటల్ ఆఫ్ ది చైనాగా ప్రసిద్ధి చెందుతోంది. అక్కడ ఒక్క గర్ల్ ఫ్రెండ్‌ను కలిగి ఉండడం మగవాడికి నామోషి. అలాంటి వారిని చేతకానివాడంటూ తోటి స్నేహితులే గేలి చేస్తారు. అక్కడ యవ్వనంలోవున్న ప్రతి మగవాడికి ఇద్దరు లేక ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమందికి ఎక్కువ కూడా ఉన్నారు. వారంతా డబ్బున్న విలాస పురుషులేమీ కాదు. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అందరూ సాధారణ కార్మికులే. ఫాక్టరీల్లో పనిచేసే ఉద్యోగస్థులే. వారికి సరాసరి నెలకు 20 వేల రూపాయల జీతం వస్తుంది. ఒక్క మగాడు ముగ్గురు లేదా నలుగురు గర్ల్ ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నా వారి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. ఒకరికి తెలియకుండా ఒకరితో తిరిగే ప్రసక్తే లేదు. అనేక సందర్భాల్లో వారంతా కలిసే తిరుగుతారు. ఒకే కప్పు కింద, ఒకే పడక గదిలో పడుకుంటారు. నగరంలోని కంపెనీలు మహిళా ఉద్యోగుల కోసం డార్మెట్ గదుల వసతిని కల్పిస్తోంది. ఒక్కో గదిలో ముగ్గురేసి మహిళలు ఉంటారు. అలా ఉండడం వల్ల తమకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉండడం లేదనుకున్న మెజారిటీ మహిళా ఉద్యోగులు బయట రూమ్‌లు తీసుకొని ఉంటున్నారు. బాయ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు రూమ్‌ను ప్లాస్టిక్ కర్టెన్ల్తో విభజించడం లేదా వారికి ప్రైవసీ కల్పిస్తూ ఇతర గర్ల్స్ వాకింగ్‌కు అలా బయటకు వెళ్లడం అక్కడ మామూలు విషయంగా మారింది. వారి మధ్య ఎలాంటి గొడవలు జరగ్గపోవడమూ కూడా విశేషమే. గర్ల్ ఫ్రెండ్స్‌ను మెయింటేన్ చేయడం కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న భయాందోళనలు మగవాళ్లకు అవసరం లేదు. మగవాళ్లకే గర్ల్ ఫ్రెండ్స్ ఖర్చు పెడతారు. తన బాయ్ ఫ్రెండ్‌కు నెలకు 20 వేల రూపాయలు వస్తాయని, అతన్ని ఎక్కువసార్లు తానే షికార్లకు తీసుకెళతానని, డబ్బులు తానే ఖర్చు పెడతానని, తన బాయ్ ఫ్రెండ్ పర్సు చూసి అందులో డబ్బులు తక్కువుంటే రెండు, మూడొందల రూపాయలు అతని పర్సులో పెడతానని జియావో కిన్ అనే 23 ఏళ్ల అమ్మాయి తెలియజేసింది. తన బాయ్ ఫ్రెండ్‌కు కూడా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, బాయ్ ఫ్రెండ్‌ను మెప్పించేందుకు తామే ఎక్కువ ఖర్చు పెడుతుంటామని ఆమె చెప్పింది. లీ బిన్, జియావో లిన్ అనే యువకులు తమకు ముగ్గురేసి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని గొప్పగా చెప్పకున్నారు. వారిలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్‌కాగా, ఒకరు తన లవర్ అని లీ బిన్ తెలిపారు. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే లవర్ ఒప్పుకుంటారా ? అని ప్రశ్నించగా తమ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందని చెప్పారు. తామంతా యవ్వనాన్ని ఇలా ఎంజాయ్ చేస్తామని, పెళ్లీడురాగానే తమ గర్ల్ ఫ్రెండ్స్ వారింటికి వెళ్లి తమకు నచ్చిన వారిని చేసుకుంటారని, వారెంతైనా డీసెంట్ గర్ల్స్ అని జియో లిన్ వ్యాఖ్యానించారు. సరాసరి 27 ఏళ్ల వయస్సులో నగరంలోని మహిళలు పెళ్లి చేసుకుంటున్నారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ఈ సరికొత్త ట్రెండ్‌పై 'చైనా పీపుల్స్ డాట్ కామ్' సర్వే జరిపింది. నగరంలో ఈ కొత్త ట్రెండ్‌కు కారణం మహిళలు ఎక్కువగా ఉండటమేనని తెలిపింది. వంద మంది మహిళలకు 89 మంది మగాళ్లు ఉన్నారు. అందుకు కారణం మహిళలకు మాత్రమే ఉద్యోగాలిస్తామంటున్న కంపెనీలు నగరంలో పెరిగిపోవడమేనట. ఈ నగరం ట్రెండ్‌పై చైనాలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పటికీ ఎలాంటి చట్టాలు లేకపోవడంతో ఏ ట్రెండ్‌ను నియంత్రించలేకపోతున్నామని చైనా ప్రభుత్వం చెబుతోంది. వలస కార్మికులకు మాత్రమే ఈ ట్రెండ్ పరిమితమైందని సమర్థించుకుంటోంది. -
ఆసీస్ క్రికెటర్ల ’వాగ్స్’పైతీవ్రస్థాయిలో దుమారం
-
అమ్మాయిల జోలికి పోనంటున్న నితిన్