
సంజయ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సీనియర్ హీరో సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటివరకు మున్నాభాయ్ సిరీస్, త్రీ ఇడియట్స్, పీకే వంటి అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కింది. స్టార్ కిడ్‌గా సినీ రంగ ప్రవేశం చేసి.. అనేక విజయాలు, పరాజయాలు అందుకొని.. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన సంజయ్ దత్ జీవితకథను దర్శకుడు హిరానీ ఎంతో ఆసక్తికరంగా దృశ్యరూపం ఇచ్చాడు. నూటికినూరు శాతం సంజు పాత్రలో జీవించాడా? అన్నస్థాయిలో రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో నటించాడు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సంజయ్ దత్ తనకు 308 మంది ప్రియురాళ్లు ఉన్నట్టు నిజాయితీగా వెల్లడించాడు. మీ బయోపిక్ వస్తే.. మీకు ఎంతమంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారో నిజాయితీగా వెల్లడిస్తారా? అని ఓ విలేకరి అడుగగా.. సంజుకు 308 మంది ఉన్నారు. కానీ, తన ప్రియురాళ్ల సంఖ్య ఇంకా పదికి కూడా చేరలేదని రణ్‌బీర్ చెప్పాడు. సంజుభాయ్‌కి ఎంతో ధైర్యం ఉంది కాబట్టి జీవితకథను సినిమాగా తెరకెక్కించేందుకు అనుమతించాడని, కానీ తన జీవితకథ ఎప్పటికీ బయోపిక్‌గా తెరకెక్కబోదని, అందుకు తాను అంగీకరించనని రణ్‌బీర్ కపూర్ చెప్పాడు. తన జీవితంలోని రహస్యాలను బట్టబయలుచేసే ధైర్యం తనకు లేదన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment