నాకు విడాకులిస్తున్నావా? అని భార్యను అడిగా: నటుడు | Actor Aayush Sharma Recalls Divorce Rumours with Arpita Khan | Sakshi
Sakshi News home page

దోస తినడానికి బయటకు.. డివోర్స్‌ రూమర్స్‌.. ఇన్నాళ్లకు స్పందించిన నటుడు

Published Fri, May 10 2024 5:08 PM | Last Updated on Fri, May 10 2024 5:20 PM

Actor Aayush Sharma Recalls Divorce Rumours with Arpita Khan

సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పిత ఖాన్‌, నటుడు ఆయుశ్‌ శర్మ కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా 2011లో కలిశారు. మొదట ఫ్రెండ్సయ్యారు. తర్వాత లవ్‌ బర్డ్స్‌ అయ్యారు. 2014లో భార్యాభర్తలయ్యారు. అనంతరం అహిల్‌(కుమారుడు), అయత్‌ (కూతురు)లకు పేరెంట్స్‌ అయ్యారు. అయితే 2019లో వీరిద్దరూ విడిపోతున్నట్లు రూమర్స్‌ వచ్చాయి.

దోస తిని వచ్చేలోపు
ఆ పుకార్లను పటాపంచలు చేస్తూ వీరిద్దరి మధ్య బంధం ఏ యేటికాయేడు మరింత స్ట్రాంగ్‌ అవుతూ వస్తోంది. తాజాగా ఆయుశ్‌ అప్పటి విడాకుల రూమర్స్‌ గురించి స్పందించాడు. నా లైఫ్‌ గురించి పుకార్లు రాసేంత ఇంట్రస్ట్‌ ఎవరికీ ఉండేది కాదు. కానీ ఓసారి చిన్న సంఘటన జరిగింది. నేను నా బాబును బయటకు తీసుకెళ్లి దోస తినిపించి వస్తున్నాను. 

విడాకులు తీసుకుంటున్నారా?
క్షణాల్లో కొందరు ఫోటోగ్రాఫర్లు నా ముందు జమగూడి అర్పిత, మీరు విడాకులు తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విని షాకయ్యాను. ఇంటికెళ్లాక అర్పిత, నేను దీని గురించి మాట్లాడుకుని నవ్వుకున్నాం. ఏంటి? నాకు విడాకులిస్తున్నావంటగా? అని అర్పితను ఆటపట్టించాను' అని ఆయుశ్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: బుల్లితెర నటి ఇంట సెలబ్రేషన్స్‌.. బాబు ఊయల ఫంక్షన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement