aayush sharma
-
నాకు విడాకులిస్తున్నావా? అని భార్యను అడిగా: నటుడు
సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్, నటుడు ఆయుశ్ శర్మ కామన్ ఫ్రెండ్స్ ద్వారా 2011లో కలిశారు. మొదట ఫ్రెండ్సయ్యారు. తర్వాత లవ్ బర్డ్స్ అయ్యారు. 2014లో భార్యాభర్తలయ్యారు. అనంతరం అహిల్(కుమారుడు), అయత్ (కూతురు)లకు పేరెంట్స్ అయ్యారు. అయితే 2019లో వీరిద్దరూ విడిపోతున్నట్లు రూమర్స్ వచ్చాయి.దోస తిని వచ్చేలోపుఆ పుకార్లను పటాపంచలు చేస్తూ వీరిద్దరి మధ్య బంధం ఏ యేటికాయేడు మరింత స్ట్రాంగ్ అవుతూ వస్తోంది. తాజాగా ఆయుశ్ అప్పటి విడాకుల రూమర్స్ గురించి స్పందించాడు. నా లైఫ్ గురించి పుకార్లు రాసేంత ఇంట్రస్ట్ ఎవరికీ ఉండేది కాదు. కానీ ఓసారి చిన్న సంఘటన జరిగింది. నేను నా బాబును బయటకు తీసుకెళ్లి దోస తినిపించి వస్తున్నాను. విడాకులు తీసుకుంటున్నారా?క్షణాల్లో కొందరు ఫోటోగ్రాఫర్లు నా ముందు జమగూడి అర్పిత, మీరు విడాకులు తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విని షాకయ్యాను. ఇంటికెళ్లాక అర్పిత, నేను దీని గురించి మాట్లాడుకుని నవ్వుకున్నాం. ఏంటి? నాకు విడాకులిస్తున్నావంటగా? అని అర్పితను ఆటపట్టించాను' అని ఆయుశ్ చెప్పుకొచ్చాడు.చదవండి: బుల్లితెర నటి ఇంట సెలబ్రేషన్స్.. బాబు ఊయల ఫంక్షన్ -
నన్ను అంత మాటన్నారు.. ఏడ్చేసిన నటుడు
ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. చాలామంది ఇక్కడ నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరే సఫలీకృతులవుతారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చెల్లిని పెళ్లాడిన ఆయుష్ శర్మ కూడా నటుడిగా ప్రయత్నించాలనుకున్నాడు. లవ్ యాత్రి అనే సినిమా చేశాడు. దీన్ని సల్మాన్ ఖాన్ నిర్మించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆయుష్ మీద విమర్శల వర్షం కురిసింది. ఆయుష్కు బదులుగా ఓ కుక్కను పెట్టి సినిమా తీయాల్సిందని తీవ్రంగా ట్రోల్ చేశారు.నానా మాటలు..తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యాడు ఆయుష్. 'నా పిల్లలు నన్ను చూసి గర్వపడాలనుకున్నాను. కానీ ఆరోజు నా గురించి చాలా చెత్తగా మాట్లాడారు. ఆ సినిమా రిలీజైన రోజు నానా మాటలన్నారు. నన్ను కుక్కతో పోల్చారు. రేపు పొద్దున నా కుమారుడు పెద్దయ్యాక ఈ వార్త చదివితే నా పరిస్థితి ఏంటి? నా కూతురు.. మా నాన్న ఒక శునకం అని ఉన్న వార్తలు చూస్తే నేనేం కావాలి? వాళ్లు తండ్రి గురించి మంచి విషయాలు తెలుసుకోవాలి..నన్ను శునకంతో పోల్చారునన్ను చూసి గర్వంగా ఫీలవ్వాలి. ఒక మీడియా అయితే ఆయుష్ శర్మ ఒక కుక్క అని రాసేసింది. కానీ వాళ్లకు నేనిప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నన్ను అవమానించడం వల్లే నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను' అని ఎమోషనలయ్యాడు. కాగా ఆయుష్.. తర్వాత సల్మాన్‌తో అంతిమ్ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇది హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇతడు నటించిన రుస్లాన్ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది.చదవండి: అభిషేక్ అగర్వాల్ నుంచి ‘ది ఢిల్లీ ఫైల్స్ ’ .. రిలీజ్ ఎప్పుడంటే? -
డబ్బు కోసమే సల్మాన్ చెల్లితో పెళ్లి? స్పందించిన నటుడు
'నువ్వు డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నావు..' ఇది జనాలు ఇప్పుడంటున్న మాట కాదు, గత తొమ్మిదేళ్లుగా ఇలా సూటిపోటి మాటలతో బాలీవుడ్ నటుడు ఆయుశ్ శర్మను జనాలు ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. 2014లో అతడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్‌ను పెళ్లాడాడు. వీరికి అహిల్ అనే కుమారుడు, అయత్ అనే కూతురు ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయుశ్ శర్మ మాట్లాడుతూ.. 'అర్పిత చాలా శక్తివంతమైన అమ్మాయి. తనలాంటి మహిళ నా భాగస్వామిగా రావడం అదృష్టం. మా మీద జరిగే ట్రోలింగ్ మమ్మల్ని అంతగా బాధించదు. ఎందుకంటే సినీరంగంలో ఉన్నవారికి ఇలాంటివి మామూలేనని మాకు బాగా తెలుసు. కానీ నేను బాగా బాధపడ్డ విషయమేంటంటే.. అర్పితను నేను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని, నటుడిగా ఎదగడానికి ఆమెను వాడుకున్నానని చాలామంది ట్రోల్ చేశారు. నేను డబ్బును కాదు అర్పితను ప్రేమించాను, అందుకే తనను పెళ్లి చేసుకున్నాను. ఆ విషయం తనకు, నాకు, మా కుటుంబాలకు తెలుసు. మరో విషయమేంటంటే.. నేను ఏదైనా వెకేషన్‌కు వెళ్లినప్పుడు అందరూ నేను సల్మాన్ డబ్బులు ఖర్చు పెడుతున్నానని విమర్శించేవారు. నా పెళ్లికి సల్మాన్ రోల్స్ రాయిస్ కారు గిఫ్ట్ ఇచ్చాడని వార్తలు రాశారు. మరి ఆ రోల్స్ రాయిస్ కారు ఏమైంది? ఎక్కడుందనేది నాకిప్పటికీ అర్థం కాదు' అని చెప్పుకొచ్చాడు ఆయుశ్. కాగా మాజీ కేబినెట్ మంత్రి సుఖ్ రామ్ మనవడే ఆయుశ్. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అతడు లవ్యాత్రి, అంతిమ్ చిత్రాల్లో నటించాడు. చదవండి: ఆలియా భట్ ఇంట విషాదం.. -
‘అంతిమ్’లో పోలీస్‌గా నటించేటప్పుడు కొంచెం భయపడ్డాను: సల్మాన్ ఖాన్
Salman Khan: బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ హీరోగా, ఆయుష్ శర్మ ప్రతినాయకుడిగా కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘అంతిమ్’. ప్రస్తుతం ఈ మువీ బాక్సాఫీస్ వద్ద బారీ వసూళ్లు రాబడుతోంది. నవంబర్ 26న రిలీజ్ అయిన యాంటిమ్ చిత్రం కేవలం 3 రోజుల్లోనే 17 కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. చిత్రం విజయంపై బాయ్ తాజాగా మీడియాతో సంభాషించారు. 'అంతిమ్' మువీలో పోలీసుగా నటించడానికి భయపడ్డానని, గతంలో పోషించిన పోలీసు పాత్రలతో పోల్చితే ఇది విభిన్నమైన పాత్ర అని, చిత్రం మొత్తం చాలా సరదాగా సాగిపోతుందని మీడియాకు తెలిపారు. ప్రస్తుతం సల్మాన్ 'అంతిమ్' ప్రమోషన్స్‌పై దృష్టి సారించారు. దీనిలో భాగంగా దేశంలోని మెట్రో నగరాలకు వెళ్లనున్నారు. చిత్రం బృందంతో కలిసి 'అంతిమ్' ప్రచారం కోసం గుజరాత్, ఢిల్లీ, తన స్వస్థలమైన ఇండోర్‌కు వెళ్లినట్లు సమాచారం. -
పిల్లల నుంచే నేర్చుకుంటున్నా: నటుడు
లాక్డౌన్ వల్ల పొద్దస్తమానం ఇంట్లోనే ఉండటంతో నేర్చుకోడానికి ఎంతో సమయం దొరుకుతోంది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ శర్మ కూడా ప్రస్తుతం ఎంతో నేర్చుకుంటున్నాడంటున్నాడు. అది కూడా తన పిల్లలు నేర్పిస్తున్నారని చెప్తున్నాడు. ప్రస్తుతం అతను తన కుటుంబంతో కలిసి సల్మాన్ ఖాన్ ఫార్మ్ హౌస్‌లో ఉన్నాడు. పిల్లలతో గడుపుతూ కాలాన్ని వీలైనంత సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఎప్పుడూ చిరునవ్వును చెరగనివ్వని పాల బుగ్గల పిల్లలు తనకో విషయం నేర్పించాడని చెబుతున్నాడు. తనకే కాదు.. ప్రతీ పిల్లవాడు పెద్దలకు మూడు విషయాలను బోధిస్తున్నాడని పేర్కొన్నాడు. మొదటిది.. ఏ కారణం లేకుండానే సంతోషంగా ఉండటం, రెండోది ఎల్లప్పుడూ ఉత్సుకత ప్రదర్శించడం, ముచ్చటగా మూడోది నిర్విరామంగా పోరాడటం.. అని చెబుతూ తన పిల్లలు అహిల్, అయాత్ ఫొటోలను సోషల్ మీడియా పంచుకున్నాడు. (అనుష్క విషయంలో ఇదీ వదంతేనా? ) కాగా ఆయుష్.. కండలవీరుడు సల్మాన్ ఖాన్ చిన్న సోదరి అర్పితాఖాన్ను 2014లో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అహిల్, అయాత్ అనే పిల్లలున్నారు. ఇక సల్మాన్ ఖాన్ పుట్టినరోజైన డిసెబర్ 27 నాడే అయాత్ జన్మించడం విశేషం. గతంలోనూ ఆయన కుటుంబ సభ్యులతో దిగిన పలు ఫొటోలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా అందరూ ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో ఎన్నో జ్ఞాపకాలను గూడు కట్టుకోండని సూచించాడు. ఇదిలావుండగా ఆయుష్ శర్మ "క్వత" చిత్రంలో కనిపించనున్నాడు. ఇందులో హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరి ఇసాబెల్లి కైఫ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. (నిన్నెంతగా ప్రేమిస్తున్నానో తెలుసా: సాయి పల్లవి) View this post on Instagram A child can teach an Adult 3 things - To he happy for no reason - To always be curious - To fight tirelessly for something Paulo Coelho A post shared by Aayush Sharma (@aaysharma) on Apr 23, 2020 at 3:41am PDT -
బావా.. ఆల్ ది బెస్ట్: సల్మాన్ ఖాన్
సాక్షి, ముంబయి: బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న తన బావకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. కండలవీరుడి చిన్న సోదరి అర్పితా ఖాన్ భర్త ఆయుష్ శర్మ ‘సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్’ ప్రొడక్షన్ పై తెరకెక్కుతున్న నూతన చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. ఈ నేపథ్యంలో 'ఆయుష్ శర్మ నీకు శుభాకాంక్షలు, ఇక మీదట నీ కృషి, పట్టుదలే నిన్ను పైకి తీసుకొస్తాయని' పేర్కొంటూ సల్మాన్ ట్వీట్ చేశారు. ఆల్ ది బెస్ట్ బావా అంటూ సల్మాన్ చేసిన ట్వీట్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అభిరాజ్ మిన్వాలే దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం ద్వారా ఆయుష్ శర్మ బాలీవుడ్లో అడుగుపెట్టనున్నాడు. గుజరాత్ నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా.. దర్శకుడు అభిరాజ్‌కు కూడా ఇదే తొలిచిత్రం కావడం విశేషం. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్, ఆయుష్ శర్మల వివాహం 2014లో హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వారం పాటు జరిగిన ఈ భారీ వేడుకకు నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్ వేదికైంది. ఆయుష్, అర్పితా దంపతులకు ఏడాదిన్నర కుమారుడు ఆహిల్ ఉన్నాడు. -
సల్మాన్ షూటింగ్‌కు ఊహించని అతిథి
కాశ్మీర్: అసలే ఎండాకాలం.. కానీ అక్కడ మాత్రం అలా అనిపించకపోవచ్చు. ఎందుకంటే అది మంచు ప్రాంతం. కాశ్మీర్ మిగతా ప్రాంతాలకన్నా ఎప్పటికీ ఆహ్లాదంగానే ఉంటుంది కూడా. కానీ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మాత్రం కాస్త చిరాకుగా, ఒత్తిడిగా అనిపించింది. అలా అనిపించేలోపే తిరిగి గాల్లో తేలిపోయినట్లు ఒక్కసారిగా లేచి నిల్చున్నారు. ముఖంలో చిరునవ్వు. ఒత్తిడి మాయం. ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా..! ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తూ కబీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం బజ్రంగి భైజాన్ కాశ్మీర్ లోయలో షూటింగ్ జరుపుకుంటోంది. చుట్టూ నటీనటులు, కెమెరాలు, మైక్ సౌండ్లతో కాస్తంత అలసి పోయిన సల్మాన్ వెంటనే రిలీఫ్ అయ్యారు. అందుకు కారణం ఆయన గారాల చెల్లెలు అర్పిత, బావ అయూష్ శర్మ అనుకోకుండా షూటింగ్ వద్దకు వచ్చారంట. దీంతో ఒక్కసారిగా తన కుటుంబ సభ్యులు కనిపించడంతోపాటు తాను ఎంతగానో ఇష్టపడే సోదరి అర్పిత ఊహించకుండా వచ్చేసరికి ఆయన ఒక్కసారిగా సంతోషంలో మునిగిపోయారని, అక్కడ చిరునవ్వులు విరబూసాయని అర్పిత ట్వీట్ చేసింది. -
ఫలక్‌నుమా ప్యాలెస్ లో హీరో సోదరి పెళ్లి
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం హైదరాబాద్‌లో జరగనుంది. ప్రతిష్టాత్మక తాజ్ ఫలక్ నుమా ప్యాలస్ ఈ వివాహ వేడుకకు వేదిక కానుంది. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ ధ్రువీకరించారు. అర్పిత వివాహం ఏడాది జనవరిలో జరగనుంది. అయితే వివాహ తేదీని ఇంకా ఖరారు చేయలేదని సలీమ్ ఖాన్ తెలిపారు. 'మేము చాలా కూల్‌గా వివాహ వేడుకను నిర్వహించాలనుకుంటున్నాం. అందుకు ఫలక్‌నూమా ప్యాలెస్ ను వేదికగా ఎన్నుకున్నాం. ఇటీవలి కాలంలో హైదరాబాద్ రాలేదు. ఫలక్‌నూమా వండర్ఫుల్ వెన్యూ కావటంతో అందరం అంగీకరించాం' అని సలీమ్ ఖాన్ పేర్కొన్నారు. సల్మాన్ ముద్దుల చెల్లెలు అర్పిత... ఢిల్లీకి చెందిన ఆయుష్ శర్మ లవ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలు వీరిద్దరి ప్రేమకు ఆమోదం తెలపటంతో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వీరి పెళ్లిని ముస్లిం, హిందూ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పెళ్లికూతురుతో పాటు సల్మాన్ కుటుంబ సభ్యులు ...ఫలక్ నూమా ప్యాలెస్‌ను సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు సమాచారం. కాగా అత్యంత ఆర్భాటంగా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి పెళ్లిళ్లు జరిపించే సంపన్నులు ఈ మధ్య కాలంలో ఫలక్ నుమా ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ని బుక్ చేసుకోవటం విశేషం.