
సల్మాన్ ఖాన్‌తో తన సోదరి అర్పితా ఖాన్(ఫైల్)
ముంబై: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ భావోద్వేగంతో సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశారు. సోదరుడే తన సర్వస్వమని తెలిపారు. ‘నా బలం, నా బలహీనత, నా గర్వం, నా సంతోషం, నా జీవితం, నా ప్రపంచం. నిన్ను, నీ విజయాన్ని చూసి ఓర్వలేని వారందరినీ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా. వారి చెడు దృష్టి నీపై పడకుండా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు ఇంకా ప్రకాశవంతం కావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. నీ విజయం, మంచి పనులు నిన్ను ద్వేషించే వారిని అంధుల్ని చేయాలి. లవ్ యూ భాయ్’ అని ఆమె ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు.
కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 1998లో నమోదైన ఈ కేసుకు సంబంధించి జోధ్‌పూర్ న్యాయస్థానం గత గురువారం తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో రెండు రోజులు గడిపారు. ఆ తర్వాత బెయిలుపై బయటికి వచ్చారు. ప్రస్తుతం ఆయన ముంబయిలో ఉన్నారు. తన తర్వాతి చిత్రం షూటింగ్‌కు కూడా ఆయన వెళ్లనున్నట్లు సమాచారం.
సల్మాన్ ‘టైగర్ జిందా హై’ చిత్రంతో ఇటీవల మంచి హిట్ అందుకున్నారు. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.570 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. దీని తర్వాత ఆయన ‘రేస్ 3’ సినిమాలో నటిస్తున్నారు. సల్మాన్ హీరోగా ‘భారత్’, ‘దబాంగ్ 3’, ‘కిక్ 2’ సినిమాలు తెరకెక్కనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment