earrings
-
క్రియేటివిటీతో లక్షల్లో సంపాదన: ఓ ‘అమ్మ’ సక్సెస్ స్టోరీ
మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం చాలా ముఖ్యం. నిజానికి గృహిణులుగా ఉంటూ గ్రామీణ మహిళలు కుటుంబానికి చాలా అండగా ఉంటారు. పశు పోషణ అంతా వారి మీదే ఆధారపడి ఉంటుంది. పాలమ్మి, పిడకలమ్మి, విస్తరాకులు కుట్టి, లేసులు అల్లి మిషన్ కుట్టి ఇలా ఒకటి కాదు.. ఏదో రకంగా తమకంటూ కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. కానీ వారి సంపాదన, శ్రమ లెక్కలోకి రాదు అంతే. విద్యావంతులైన మహిళలు కూడా తమ చదివిన చదువుకు సార్థకత సాధించాలనే ఆలోచిస్తారు. ఆలా యూకేకు చెందిన మహిళ తనకు నచ్చిన విద్యతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. లక్షలు వెనకేసింది. పూర్తి వివరాల కోసం కథనాన్ని చదవండి. రాచెల్ పెళ్లి, పిల్లల తరువాతఇంట్లోనే ఉంటూ కుటుంబ జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఆర్థికంగా పటిష్టంగా నిలబడింది. రాచెల్ తన కసృజనాత్మకతకు పదును పెట్టి, ఒక పనిని ఎంచుకుంది. సరికొత్తగా కెరీర్ బాటలు వేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించింది. ఆకర్షణీయంగా చెవిపోగులను తయారు చేస్తూ పేరు తెచ్చుకుంది. క్రమంగా అది విస్తరించి వ్యాపారంగా మారిపోయింది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే దాదాపు 13 లక్షల రూపాయలను ఆర్జించింది. రాచెల్‌కు ఇద్దరు పిల్లల తల్లిగా వారి ఆలనా పాలనా చేసుకుంటూనే డబ్బులు సంపాదించే మార్గాన్ని అన్వేషించింది. ఈ క్రమంలోనే పిల్లలు నిద్రపోతున్న సమయంలో స్కల్పే పాలిమర్ క్లేతో అందమైన డిజైన్లతో చెవిపోగులు తయారు చేయడం ప్రారంభించింది. సిరా, వైట్, యాక్రిలిక్ పెయింట్‌తో తయారు చేసిన ఇయర్ రింగ్స్ డిజైన్స్‌కు మంచి ఆదరణ లభించింది. ఆన్లైన్ వెంచర్ (Etsy) ద్వారా తన వ్యాపారాన్ని అభివృద్ది చేసుకుంది. ఒక్కో జతను ఎట్సీలో దాదాపు 30 పౌండ్ల (రూ.3,000) చొప్పున విక్రయించేది. తన వెంచర్‌ను లాభదాయకంగా మార్చుకుంది. హ్యాండ్‌మేడ్ ఒరిజినల్ ఆభరణాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. 2021 నుంచి దాదాపు 435 జతల చెవిపోగులను విక్రయించి, రూ. 13 లక్షలకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. నేర్చుకోవాలనే ఆసక్తివున్న ఔత్సాహికులకు శిక్షణ కూడా ఇస్తుంది. -
సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో భారీ దొంగతనం
ఇటీవల సెలబ్రిటీల ఇళ్లలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య రజనీకాంత్‌ల ఇళ్లలో ఈమధ్య భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో చోరీ జరిగింది. చదవండి: అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కృతిశెట్టి? ఈనెల 16న తన డైమెండ్ ఇయరింగ్స్ పోయాయని గమనించిన అర్పితా అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటి విలువ రూ. 5 లక్షలకు పైనే ఉంటుందని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది ఇంటిదొంగల పనే అని కనిపెట్టారు. అర్పితాఖాన్ ఇంట్లో 11మంది పనివాళ్లు ఉన్నారు. వారిలో సందీప్ హెగ్డే అనే పనిమనిషి మాత్రం దొంగతనం జరిగిన రోజు నుంచీ కనిపించకుండా పోయాడు. అతడి ఇంట్లో పోలీసులు సోదా చేయగా అర్పితా ఖాన్ చెవిపోగులు దొరికాయాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సందీప్ హెగ్డేను అరెస్ట్ చేశారు. చదవండి: శింబుకి షాక్ ఇచ్చిన దీపికా పదుకొణె.. ఆ కండీషన్స్‌కి దిమ్మతిరిగిపోయిందట -
యువ ఇంజనీర్ నిర్వాకం.. బర్త్‌డేను గ్రాండ్‌గా జరుపుకోవాలని..
న్యూఢిల్లీ: సాధారణంగా చాలా మంది తమ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించుకోవడానికి ఇష్టపడుతుంటారు. దీని కోసం అనేక ప్లాన్లు వేస్తుంటారనే విషయం తెలిసిందే. ఒక మంచి హోటల్లో బంధువులు, స్నేహితులను పిలిచి వారి మధ్య బర్త్‌డే వేడుకలను గ్రాండ్‌గా జరుపుకొని తమ రిచ్‌నేస్‌ను చూయించుకోవాలనుకుంటారు. అయితే, ఇక్కడో యువ ఇంజనీర్ కూడా.. తన జన్మదినాన్ని గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకోవాలనుకున్నాడు. అయితే, దీని కోసం ఆ ప్రబుధ్దుడు మాత్రం చోరీల బాటపట్టాడు. ఈ సంఘటన ఢిల్లీలోని మన్సరోవర్ పార్క్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఢిల్లీకి చెందిన ఒక మహిళ ప్రతిరోజు మన్సరోవర్ పార్క్‌కు వాకింగ్‌కు వెళ్తుండేది. ఈ క్రమంలో.. గడిచిన శుక్రవారం రోజు మహిళ వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని యువకుడు ఆమెను అనుసరించాడు. ఒక్కసారిగా ఆమెపై దాడిచేసి, బలవంతంగా చెవిరింగులను లాక్కొని అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యాడు. దీంతో, ఆమె షాక్‌కు గురయ్యింది. ఆ తర్వాత తేరుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆగంతకుడు ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పార్క్ పరిధిలోని 30 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆగంతకుడు ముఖానికి మాస్క్ ధరించి ఉండటం.. బైక్‌కు నంబర్ ప్లేట్ లేకపోవడం వలన నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. నిందితుడి కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గస్తీని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో.. గత ఆదివారం రోజున పార్క్ పరిసరాల్లో ఒక యువకుడు నంబర్‌ప్లేట్‌లేని బైక్‌తో ఉండటాన్ని గస్తీ పోలీసులు గమనించారు. అతని కదలికలు అనుమానస్పదంగా ఉన్నాయి. దీంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. దీంతో అతగాడు.. తన పేరు గౌతమ్ అని.. షాహదారాలోని జ్యోతి నగర్లో ఉంటానని తెలిపాడు. కాగా, బీఎస్ఈఎస్లో జూనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా, తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా జరుపుకోవడం కోసమే చోరికి పాల్పడినట్లు అంగీకరించాడు. చోరి చేసిన బంగారాన్ని ఒక దుకాణంలో అమ్మేసినట్లు తెలిపాడు. దీంతో గౌతమ్‌పై పలు సెక్షన్ల కింది కేసుల నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. -
చెవి రింగులతో ర్యాష్ వస్తోందా?
కొందరికి చెవి రింగులు లేదా దుద్దుల కారణంగా చెవి ప్రాంతం ఎర్రబడటం, ర్యాష్ రావడం జరుగుతుండవచ్చు. సాధారణంగా చాలావరకు కృత్రిమ ఆభరణాలలో నికెల్ అనే లోహం ఉంటుంది. దీనివల్ల ర్యాషెస్ వస్తాయి. ఇలాంటివి ఆభరణాల కారణంగా కొందరిలో చెవి వద్ద కాస్తంత దురద, చెవి రంధ్రం వద్ద ఎర్రబారడం వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి. ఈ దశలో దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత అక్కడి గాయం రేగిపోయి, రక్తస్రావం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ టు నికెల్’ అంటారు. ఈ సమస్య ఉన్నవారు ఈ కింది సూచనలు పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇలాంటివారు నికెల్‌తో చేసిన కృత్రిమ ఆభరణాలు, రింగులు, దిద్దులు ధరించడం సరికాదు. వీరు మొమెటజోన్ ఉన్న ఫ్యూసిడిక్ యాసిడ్ లాంటి కాస్త తక్కువ పాళ్లు కార్టికోస్టెరాయిడ్ కలిసి ఉన్న యాంటీబయాటిక్ కాంబినేషన్‌తో లభించే క్రీములను గాయం ఉన్నచోట రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 10 రోజులు రాయండి. ఇలాంటి క్రీములను సాధారణంగా డర్మటాలజిస్ట్ ల సూచనలతో వాడటమే మంచిది. -
బరువైన చెవి రింగులు వాడుతున్నారా?
ఇటీవలి ఫ్యాషన్లలో భాగంగా కొందరు విపరీతమైన బరువుండే ఇయర్ రింగ్స్ వాడటం కూడా చూస్తుంటాం. ఇలా ఫ్యాషనబుల్ ఇయర్ రింగ్స్ లేదా హ్యాంగింగ్స్ వేసుకునే క్రమంలో అత్యంత బరువైనవి వాడుతూ ఉంటే... వాటి బరువు కారణంగా క్రమంగా చెవి రంధ్రం సాగి, పెద్దదైపోయి తెగిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా ఎక్కువ బరువుండే ఇయర్ రింగ్స్ లేదా హ్యాంగింగ్స్ వేసుకోవడం బాగా సాగిపోయిన చెవి రంధ్రాలు లేదా పూర్తిగా తెగిపోయిన చెవి తమ్మెను ప్లాస్టిక్ సర్జరీ ప్రక్రియ ద్వారా రిపేర్ చేయడం సాధ్యమవుతుంది. దీనికోసం రోగికి పూర్తి మత్తు ఇవ్వనవసరం లేదు. కేవలం ఆ ప్రాంతం వరకే మొద్దుబారేందుకు మత్తు (లోకల్ అనస్థీషియా) ఇస్తే చాలు. రెండుగా తెగినట్లుగా ఉన్న చెవి తమ్మెను నేరుగానైనా లేదా మానిన తర్వాత గాయం మార్కు కనపడకుండా ఉండేలా వంకరటింకరగా (జిగ్‌జాగ్)నైనా చెవి తమ్మె రిపేర్ జరుగుతుంది. అయితే ఇలా చెవి తమ్మెలను అతికించే ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. చెవి రంధ్రం చీరుకున్న తీరును బట్టి పేషెంట్‌కు ఎలాంటి ప్రక్రియ అవసరమో వాళ్లతోనే మాట్లాడి వాళ్లకు అవసరమైన ప్రక్రియను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందులో రెండుగా చీరుకున్న రంధ్రానికి కుట్లు కోసం అత్యంత నాణ్యమైన, బయటకు కనపడనంత సున్నితమైన దారాన్ని ఉపయోగిస్తారు. ప్రక్రియ అంతా పూర్తయ్యాక చికిత్స నిర్వహించిన చోట కొన్నాళ్ల పాటు పైపూతగా ఉపయోగించే యాంటీబయాటిక్ క్రీమ్‌ను కొంతకాలం పాటు రాయాల్సి ఉంటుంది. కాకపోతే గాయం అంతా మానాక కూడా పెన్సిల్‌తో గీత గీసినంత సన్నగా ఒక గీత మాత్రం కనబడుతుంటుంది. ఈ అతికింపు ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ చెవిని కుట్టించుకోవాలంటే... చెవి రంధ్రం పూడ్చాక కనీసం రెండు వారాలు ఆగి, ఆ తర్వాత చెవి కుట్టించుకోవచ్చు. అయితే మళ్లీ మాటిమాటికీ రంధ్రం పెద్దది కాకుండా మాత్రం తప్పక జాగ్రత్త వహించాలి. ఈమారు మునపటిలా బరువైన రింగులు వేసుకోరాదు. -
‘ప్లీజ్ నా చెవిరింగు వెతికివ్వండి’
బాలీవుడ్ నటి జూహీ చావ్లా ట్విట్టర్ వేదికగా చేసిన ఓ రిక్వెస్ట్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకు దేనికి సంబంధించి ఆ రిక్వెస్ట్ అంటే జూహీ చావ్లా డైమండ్ ఇయర్ రింగ్ పొగొట్టుకున్నారు. దయచేసి తనకు సాయం చేయమని.. మంచి రివార్డు కూడా ఇస్తానంటూ ట్వీట్ చేశారు జూహీ చావ్లా. ఆదివారం సాయంత్రం చేసిన ఆ ట్వీట్లో ఇలా ఉంది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్ 2లోని గేట్ నంబర్ 8వైపు ప్రణామ్ బగ్గీలో నడుచుకుంటూ వెళ్లాను. ఎమిరెట్స్ కౌంటర్లో చెక్ చేశారు. సెక్యూరిటీ చెక్ ఇమ్మిగ్రేషన్ కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో నా డైమండ్ ఇయర్ రింగ్ ఒకటి ఎక్కడో జారి కింద పడిపోయింది. దాన్ని వెతకడంలో నాకు ఎవరైనా సాయం చేస్తే.. ఎంతో ఆనందిస్తాను. నా చెవి రింగు ఎవరికైనా కనిపిస్తే.. పోలీసులకు అందించండి. మీకు రివార్డు కూడా ఇస్తాను అన్నారు. అంతేకాక పోయిన దాని జత ఇయర్ రింగ్ ఫోటోని షేర్ చేశారు జూహీ చావ్లా. ఇక దానితో పాటు గత పదిహేనేళ్లుగా ప్రతి రోజు నేను ఈ చెవి దుద్దులను ధరిస్తూ ఉన్నాను. దయచేసి దీన్ని వెతకడంలో నాకు సాయం చేయండి’ అంటూ ట్వీట్ చేశారు జూహీ చావ్లా. ప్రస్తుతం ఈ ట్వీట్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (చదవండి: మీ టూ వల్ల తప్పించుకున్నాను!) Kindly help 🙏 pic.twitter.com/bNTNYIBaZ2 — Juhi Chawla (@iam_juhi) December 13, 2020 ఇక సినిమాల విషయానికి వస్తే.. జూహీ చివరి సారిగా 2019లో వచ్చిన ‘ఏక్ లడ్కి కో దేఖా తో ఐసా లగా’ చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో సోనమ్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఆదమరిచి.. పాప ప్రాణాల మీదకి తెచ్చారు..!
సాక్షి, ముంబై : స్మార్ట్ ఫోన్ కాలం మొదలయ్యాక పక్కనున్న మనిషిని సైతం పట్టించుకునే తీరిక లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జనాలు సమాజంలో మాత్రం అలా ఉండలేక పోతున్నారు. అందర్నీ ఆదమరచి నెట్ ప్రపంచంతో దోస్తీ కడుతున్నారు. చంటి పాపల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండకపోతే కొన్నిసార్లు పరిస్థితి చేజారుతుంది. ముంబైలోని కుర్లాలో గతవారం చోటుచేసుకున్న ఓ ఘటన పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉండొద్దనడానికి మంచి ఉదాహరణ. వివరాలు.. ఇంట్లో ఆడుకుంటున్న ఏడాది పాప కుషీ సోనీ ప్రమాదవశాత్తు చెవిపోగు మింగేసింది. అయితే, స్మార్ట్ఫోన్లతో బిజీగా ఉండి ఇంట్లోవాళ్లు ఇది గమనించకపోవడంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయింది. గొంతులో చెవిపోగు ఉండిపోవడంతో పాపకు ఇన్ఫెక్షన్తో దగ్గు, జ్వరం మొదలైంది. అంతా సాధారణ జ్వరమేనని భావించారు. జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ నయం కావడానికి మందులు వాడారు. కానీ, పాప ఆరోగ్యం కుదుటపడక పోగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.దాంతో మెరుగైన చికిత్స కోసం చిన్నారి సోనీని లోకమాన్య తిలక్ మున్సిపల్ హాస్పిటల్‌కు తరలించారు.గొంతులో ఏదైనా అడ్డుపడొచ్చని భావించి ఎక్స్‌రే తీశారు. కానీ, లాభం లేకపోయింది. ఎక్స్‌రేలో అంతా బాగానే ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. రెండుమూడు రోజుల్లో మొదటి పుట్టిన రోజు జరుపుకోవాల్సిన తమ బిడ్డ దక్కుతుందో లేదోనని ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవ్యధకు గురయ్యారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సోనీని అక్కడి నుంచి బీజే వాడియా ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరోసారి అక్కడ ఎక్స్‌రే తీయడంతో పాప గొంతులో చెవిపోగు ఉందని వైద్యులు నిర్ధారించారు. వైద్యులు దాదాపు 30 నిమిషాలపాటు శ్రమించి ఎటువంటి శస్త్ర చికిత్స లేకుండానే పాప గొంతులో ఇరుక్కున్న రెండంగుళాల చెవిపోగును తొలగించారు. వైద్యుల కృషితో ప్రాణాలతో భయటపడిన సోనీ ఆసుపత్రిలోనే గురువారం తన మొదటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. -
వాటిని దాచుకున్నా!
మీరు ‘పీకు’ సినిమా చూసే ఉంటారు. అందులో పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే వాడిన చెవిపోగులు గుర్తున్నాయా? ఆమె ఓ సన్నివేశంలో వాటిని అలంకరించుకుంటూ అద్దంలో చూసుకునే సన్నివేశాన్ని ప్రేక్షకులు అంత తొందరగా మర్చిపోలేరు. ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసిన ఆ చెవి పోగులంటే దీపికాకు చాలా ఇష్టమట. దీని గురించి ఆమె చెబుతూ -‘‘ఈ సినిమా నా కెరీర్లో మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా, నా జీవితంలో మరపురాని అనుభూతులను మిగిల్చింది. నా దృష్టిలో ఇది ఒక ప్రత్యేకమైన చిత్రం.అందులో నేను వాడిన చెవిపోగులంటే చాలా ఇష్టం. వాటిని మాత్రం పదిలంగా, ఈ సినిమాకు ఓ గుర్తుగా దాచుకున్నా’’ అని అన్నారు. -
చెవి రింగులు చోరి, పట్టుబడిన బాలీవుడ్ నటి!
సింగపూర్: చెవిరింగులు దొంగిలిస్తూ బెంగాలీ నటి స్వస్తికా ముఖర్జీ పట్టుపడ్డారు. ఈ ఘటన సింగపూర్ లో చోటు చేసుకుంది. ఓ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు తన ప్రియుడు సుమన్ ముఖర్జీ తో కలిసి స్వస్తికా సింగపూర్ వెళ్లింది. చెవిరింగులు దొంగిలించిన చిత్రాలను సీసీటీవీ ఫుటేజ్ లో చూసి ఆ జ్యూవెలరీ షాప్ యజమాని అప్సర ఓస్వాల్ దర్పణ్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. 'మేము ఫుటేజిలను చూశాం. 225 డాలర్ల విలువైన చెవిరింగులను దొంగిలించిన చిత్రాలను పరిశీలించాం. యాజమాన్యం ఫిర్యాదులో వాస్తవం ఉంది' అని ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ధృవీకరించారు. అయితే స్వస్తికా పై ఎలాంటి కేసు నమోదు చేయలేదని నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ ఘటనలో స్వస్తికా అమాకురాలని, చెవిరింగులకు నగదు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ ఘటనను వివాదంగా మార్చకుండా తగు చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. తన ప్రియుడితో కలిసి స్వస్తికా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రియుడితో గొడవపడి స్వస్తికా ముఖర్జీ ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. 'డిటెక్టివ్ బ్యోంకెష్ భక్షి' చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన స్వస్తికా ముఖర్జీ నటిస్తోంది.